ప్రముఖ నటి అనుమానాస్పద మృతి.. ఇన్‌స్టాలో 3 రోజుల ముందు పెట్టిన పోస్టు వైరల్‌

|

Apr 12, 2023 | 5:12 PM

ప్రముఖ మోడల్, నటి అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో శవమై కనిపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారో లేదా నటి సూసైడ్ చేసుకుందో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకెళ్తే..

ప్రముఖ నటి అనుమానాస్పద మృతి.. ఇన్‌స్టాలో 3 రోజుల ముందు పెట్టిన పోస్టు వైరల్‌
Zombie Detective Actor Died
Follow us on

ప్రముఖ మోడల్, నటి అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో శవమై కనిపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారో లేదా నటి సూసైడ్ చేసుకుందో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకెళ్తే.. దక్షిణ కొరియా మోడల్, నటి అయిన జంగ్ చాయ్-యుల్ (26) సోమవారం (ఏప్రిల్ 11) తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ జోంబీ డిటెక్టివ్, డీప్ మువీల ద్వారా జంగ్ చాయ్-యుల్ మంచి పాపులారిటీ పొందారు. నటి మరణాన్ని దక్షిణ కొరియాలోని ఆమె ఏజెన్సీ మేనేజ్‌మెంట్ అధికారికంగా ధృవీకరించింది.

‘ఈ రోజు అత్యంత విషాదకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాం. నటి జంగ్ చాయ్-యుల్ ఏప్రిల్ 11న మనల్ని వదిలి వెళ్లిపోయారు. జంగ్ చాయ్-యుల్ కుటుంబ సభ్యులు వారి సంప్రదాయం మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ప్రార్ధిద్దాం. మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దయచేసి ఎటువంటి వివాదాస్పద వార్తలుగానీ, రూమర్లు గానీ రాయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నామని’ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా 1996, సెప్టెంబర్ 4న జన్మించిన జంగ్ చై-యుల్ తొలుత మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2016లో కొరియన్ మోడలింగ్ షో ‘డెవిల్స్ రన్‌వే’తో మోడలింగ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు టీవీ షోలతో మంచిపేరు సంపాదించారు. 2020లో నెట్‌ఫ్లిక్స్ షో ‘జోంబీ డిటెక్టివ్‌’లో జంగ్ చై-యుల్ బే యూన్-మి పాత్ర పోషించారు. దీనికంటే ముందు నటి ‘డీప్’ మువీలో కూడా నటించారు. అలాగే వెడ్డింగ్ ఇంపాజిబుల్ అనే మరో కొరియన్‌ డ్రామాలోనూ నటించారు. ప్రస్తుతం ఇది ప్రాజెక్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నటి జంగ్ చై-యుల్ మరణించడంతో ఈ షో చిత్రీకరణను నిర్మాణ బృందం రద్దు చేసింది. జంగ్ చైయుల్‌ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నటి మృతికి మూడు రోజుల ముందు చివరి సారిగా పెట్టిన పోస్టు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.