సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సింగర్, రాపర్.. పాప్ ఐకాన్ ఆరోన్ కార్టర్ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. సౌత్ కాలిఫోర్నియాలోని అతని నివాసం ఆయన మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో కనిపించింది. సింగర్ మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఆరోన్ మృతికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆరోన్.. చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 9 ఏళ్ల వయసులోనే మొదటి ఆల్బమ్ రిలీజ్ చేశారు.
ఆరోన్ మృతికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. సింగర్ మరణాన్ని అంబ్రెల్లా మేనేజ్మెంట్లో కార్టర్ ఏజెంట్ టెలర్ హెల్గెసన్ నివేదించారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అలెజాండ్రా పర్రా ప్రకారం వ్యాలీ విస్టా డ్రైవ్‌లోని 42,000 బ్లాక్‌లోని ఆరోన్ కార్టర్ ఇంటి వద్ద ఉదయం 11 గంటలకు ఆరోన్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా సమాచారం.
కార్టర్ 1997లో బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ టూర్‌లో ఎంట్రీ ఇచ్చాడు.. అదే సంవత్సరంలో తన తొలి ఆల్బమ్ కూడా విడుదలైంది. అతను తన రెండవ సంవత్సరం ఆల్బమ్, 2000 లో “ఆరోన్స్ పార్టీ (కమ్ గెట్ ఇట్)”తో ట్రిపుల్-ప్లాటినం సొంతం చేసుకున్నాడు. ఆరోన్ “ఐ వాంట్ కాండీ”తో సహా అనేక హిట్ ఆల్బమ్‌లను విడుదల చేశాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.