సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కొందరిని కబళిస్తే.. రక రకాల కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు. మరి కొందరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. డ్రగ్స్ మత్తు మరో నటుడిని పలి తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ టెలివిజన్ నటుడు మైఖేల్ కె విలియమ్స్ మృతి చెందాడు. 54 ఏళ్ల వయస్సు కలిగిన మైఖేల్ ‘ది వైర్’ సిరీస్‌తో విశేష ప్రాచుర్యం పొందారు.
మైఖేల్ న్యూయార్క్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆగస్టు 6న మధ్యాహ్నం రెండు గంటలకు విగత జీవిగా కనిపించారు. అతని మృతిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మాదక ద్రవ్యాలను అధికంగా తీసుకోవడం వల్లే మృతి చెంది ఉండొచ్చని ప్రాధమిక అంచనా వేసారు. 2002-2008 మధ్య ‘హెచ్‌బీవో’లో ప్రసారమైన ‘ది వైర్’ సిరీస్ వేలాదిమందిని ఆకట్టుకుంది. అందులో ఆయన డ్రగ్ డీలర్ పాత్ర పోషించారు. అలాగే ‘బోర్డువాక్ ఎంపైర్’ సిరీస్‌లోనూ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’ సిరీస్‌లో విలియమ్స్ నటనకు గాను 2021 ఉత్తమ నటుడి అవార్డుకు నామినేట్ అయ్యారు. అయితే గత రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సన్నిహితులు వెళ్లి చూడగా.. డ్రగ్స్ ప్యాకెట్స్ మధ్య మైకేల్ మృతదేహం కనపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. డ్రాగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వలన మైఖేల్ చనిపోయినట్లుగా ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారణ అయింది.
ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తో ఆడియొన్స్‌కు బాగా గుర్తుండిపోయిన మికాయిల్ కె విలియమ్స్.. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్నారు. అయితే కొన్ని నెలలుగా ఆయన డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు.
Siri Hanmanth: బిగ్ బాస్ హౌస్‌లో సిరి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Allu Arjun: మలయాళ స్టార్ హీరోలతో పోల్చుకున్న బన్నీ.. అల్లు అర్జున్ ఫన్నీ వీడియో వైరల్..