లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ హీరోకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

|

Jun 02, 2023 | 8:03 AM

లైంగిక వేధింపుల కేసులో హాలీవుడ్ నటుడు డానీ మాస్టర్‌ సన్‌కు కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2001-03 మధ్య కాలంలో డానీ వరుసగా మూడు సార్లు ముగ్గురు మహదిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేరాలు రుజువు కావడంతో కోర్టు అతన్ని దోషిగా..

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ హీరోకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
Danny Masterson
Follow us on

లైంగిక వేధింపుల కేసులో హాలీవుడ్ నటుడు డానీ మాస్టర్‌ సన్‌కు కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2001-03 మధ్య కాలంలో డానీ వరుసగా మూడు సార్లు ముగ్గురు మహదిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేరాలు రుజువు కావడంతో కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. నటుడు డానీ తొలిసారి 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో మరోమారు 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదే ఏడాది చివర్లో మరో యువతిని (23) తన ఇంటికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ మూడు కేసుల్లో డానీపై కేసులు నమోదవగా.. 2020 జూన్‌లో కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఐతే అదే రోజు 3.3 మిలియన్‌ డాలర్లు చెల్లించి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసులపై తాజాగా మరోమారు కోర్టు విచారణ జరిపింది. విచారణలో డానీ దోషిగా కోర్టు తేల్చింది. రెండు కేసుల్లో డానీ అత్యాచారానికి పాల్పడ్డట్లు రుజువు అయ్యింది. ఐతే 2003 ఏడాది చివర్లో హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంట్లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో ఆ ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు.

దీంతో రెండు కేసుల్లో దోషిగా తీర్పునిస్తూ అమెరికా కోర్టు డానీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు అనంతరం అతని భార్య నటి బిజు ఫిలిప్స్‌ కోర్టులోనే బిగ్గరగా విలపించారు. కోర్టు తాజా తీర్పుపై బాధిత మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తగిన శాస్తి జరిగిందని, న్యాయం గెలిచిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.