మన జీవితంలో గూగుల్‌కు ఉన్న ప్రాధాన్యమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు తెలియని విషయం, వస్తువు, వ్యక్తి.. ఇలా దేని గురించైనా తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్‌ను ఒపెన్ చేస్తాం. సమస్త సమచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. కాగా ఏటా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ పేరిట ఓ నివేదికను విడుదలవుతుంది. గూగుల్‌లో అత్యధిక మంది దేని కోసం వెతుకుతారు? టాప్ కీ వర్డ్స్ తదితర విషయాలు ఈ నివేదికలో ఉంటాయి. అలా ఈ ఏడాదికి సంబంధించి గూగుల్ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ సెలెబ్‌టాట్లర్ విడుదల చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్ హార్డ్ టాప్‌లో ఉంది. రెండో స్థానంలో హార్డ్ మాజీ భర్త, ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీడెప్ ఉన్నారు. సగటున ప్రతి నెలా 56 లక్షల మంది అండర్ హెర్డ్ గురించి సెర్చ్ చేశారు. అలాగే జానీ డెప్ గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య 55 లక్షలుగా ఉంది.
ఆ తర్వాతి స్థానాల్లో క్వీన్ ఎలిజబెత్-II, టామ్ బ్రాడీ, కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ ఉన్నారు. ఈ లిస్టులో ఎలాన్ మస్క్ ఏడో స్థానంలో నిలువగా.. విల్‌స్మిత్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఏ ఒక్కరికీ కూడా చోటు దక్కలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన టాప్ -100 కీవర్డ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలిస్థానం యూట్యూబ్‌ది కాగా.. తర్వాతి స్థానాల్లో ఫేస్‌బుక్, ట్రాన్స్‌లేట్, పోర్న్‌హబ్, వెదర్, అమెజాన్, గూగుల్ ట్రాన్స్‌లేట్, జీమెయిల్, వాట్సాప్ వెబ్ తదితర పదాలు చోటు సంపాదించాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..