స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన దొంగలు.. సినిమా స్టైల్లో కారు చోరి.. టెక్నాలజీని వాడడంలో వీళ్లు వీరలెవల్..

|

Aug 29, 2021 | 8:47 PM

ప్రస్తుతం టెక్నాలజీ వాడకం విరివిగా పెరిగిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడకంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన దొంగలు.. సినిమా స్టైల్లో కారు చోరి.. టెక్నాలజీని వాడడంలో వీళ్లు వీరలెవల్..
Tom Cruise
Follow us on

ప్రస్తుతం టెక్నాలజీ వాడకం విరివిగా పెరిగిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడకంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ దగ్గర్నుంచి తిరిగే వాహనాల వరకు అన్నింట్లోనూ టెక్నాలజీని పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఎలక్రికల్ వాహనాలు, స్మార్ట్ కార్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. మన ఇండియాలో ఇంకా స్మార్ట్ కార్లు రాలేదు కానీ.. విదేశాల్లో ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఆధునాతన టెక్నాలజీ సామాన్యుల కంటే దొంగలకు ఎక్కువగా పనికొస్తుంది. టెక్నాలజీ సాయంతో సులభంగా దొంగతనాలు చేసేస్తున్నారు. టెక్నాలజీతో హాలీవుడ్ స్టార్ హీరోకు చుక్కలు చూపించారు. సినిమా రేంజ్‏లో దొంగతనం చేసి.. అటు స్టార్ హీరోకు.. ఇటు పోలీసులకు నయా సవాల్ విసిరారు.

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‏కు చెందిన స్మార్ట్ స్పోర్ట్స్ కారును టెక్నాలజీ ఉపయోగించి కొట్టేశారు దొంగలు. ప్రస్తుతం టామ్ మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్‏లో జరుగుతుంది. అక్కడి ఓ లగ్జరీ హోటల్‏లో చిత్రయూనిట్ బస చేసింది. టామ్ క్రూజ్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారును ఆ హోటల్ ముందు బస చేశారు. దీనిని అదునుగా తీసుకున్న దొంగలు.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో ఆయన స్మార్ట్ స్పోర్ట్స్ కారును చాకచక్యంగా కొట్టేసారు. ఆ కారు విలువ దాదాపు కోటి రూపాయలు. మోడ్రన్ కారుల అన్నీ కీలెస్ గా ఇగ్నిషన్ ఫోబ్స్ తో వస్తున్నాయి. ఇది దొంగలకు అనుకూలంగా మారుతోంది. వైర్ లెస్ ట్రాన్స్ మీటర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదే తీరులో టామ్ క్రూజ్ కారును కూడా చోరీ చేశారు. కారుకు దగ్గరగా నిలబడ్డ దొంగలు.. ఫ్రీక్వెన్సీ మీటర్ల ద్వారా ఫోబ్ సిగ్నల్ ను క్యాప్చర్ చేయగలిగారు. అదే టైంలో ఒరిజినల్ ఫోబ్ ను రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేయకుండా చేశారు. అనంతరం దర్జాగా కారును వేసుకొని వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ట్రాకింగ్ సిస్టం ద్వారా కారును ట్రేస్ చేశారు. స్మెత్ విక్ విలేజ్‏లో కారును గుర్తించారు. అయితే అక్కడ కేవలం కారు మాత్రమే ఉంది.. అందులో ఉన్న విలువ లగేజీ.. డబ్బు తీసుకుని దొంగలు పారిపోయారు. ఆ కారు విలువ దాదాపు కోటి రూపాయలు. దాని పేరు బీఎండబ్ల్యూ ఎక్స్ 7. ఇది 4 సెకన్లలో 96 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అంటే 249 కి.మీ వేగంతో ఈ కారు ప్రయాణిస్తుంది.

Also Read: Bheemla Nayak: థియేటర్‌లో విడుదలైన నెల రోజులకు ఓటీటీలో భీమ్లా నాయక్‌.? భారీ ఢీల్‌ సెట్‌ చేసుకున్న అమేజాన్‌.