High security at Film Hero Mahesh babu home : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ప్రముఖ టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు మరింత అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని తన ఇంటి దగ్గర సెక్యూరిటీ భారీగా పెంచుకున్నారు. ఇంట్లో పనిచేసేవాళ్లు మినహా మిగిలినవారిని ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇప్పటికే ప్రతిరోజూ ఇంట్లో పనిచేసేవారికి కరోనా టెస్టులు చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. కాగా, మహేష్‌బాబు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. త్వరలో సెకండ్ డోస్ తీసుకోనున్నారు. దీంతో సెకండ్ డోస్ తీసుకునేవరకూ జాగ్రత్తగా ఉండాలని మహేష్ నిర్ణయించారు. అందుకే షూటింగ్‌లు బంద్ చేసుకుని.. ఇంట్లో ఉండడమేకాదు.. బయటనుంచి వచ్చేవారి కారణంగా కరోనా మహమ్మారి రాకూడదనే ఉద్దేశంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, షూటింగ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ద్వారా దర్శక నిర్మాతలకు మహేష్ టచ్‌లోనే ఉంటున్నారు.