Allu Arjun Arrest Video: దిస్ ఈజ్ టూ మచ్.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం.. అరెస్టుకు ముందు హైడ్రామా..

అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో హైడ్రామా నెలకొంది.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసహనం వ్యక్తంచేశారు.. దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదంటూ అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.. పోలీసులు నేరుగా ఇంట్లోకి రావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.. ఇది టూమచ్ అంటూ పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Allu Arjun Arrest Video: దిస్ ఈజ్ టూ మచ్.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం.. అరెస్టుకు ముందు హైడ్రామా..
Allu Arjun

Updated on: Dec 13, 2024 | 1:57 PM

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ ను అరెస్ట్‌ చేశారు.. డిసెంబర్ నాలుగో తేదీన బెనిఫిట్‌ షో సందర్భంగా తొక్కిసలాట విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది.. ఆమె కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అయితే.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో హైడ్రామా నెలకొంది.. పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసహనం వ్యక్తంచేశారు.. దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదంటూ అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.. పోలీసులు నేరుగా ఇంట్లోకి రావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.. ఇది టూమచ్ అంటూ పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తీసుకెళ్లడం తప్పుకాదని.. అరెస్టు చేయడం తప్పుకాదని.. కానీ.. డ్రెస్ కూడా మర్చుకోనివ్వరా.. ? టు మచ్ .. ఇది మంచి విషయం కాదంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అల్లు అరవింద్‌ కూడా అర్జున్‌తోపాటు పోలీస్‌ వాహనం ఎక్కడంతో.. వద్దని వారించిన బన్నీ. దీనికి సంబంధించి ఏం జరిగినా.. అది మంచైనా, చెడైనా అంతా నాదేనంటూ తండ్రిని అల్లు అర్జున్‌ పోలీస్‌ వాహనం నుంచి దించేశారు.

వీడియో చూడండి..

అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పోలీసులు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ రెడీ అనంతరం పోలీసులు అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

పుష్ప -2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది.. అయితే ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్‌. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన. అయితే అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదైంది. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి