ఒడిస్సీ డ్యాన్సర్‏గా మారిన కాజోల్.. ఆసక్తికరంగా ‘త్రిభంగా’ టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే..

|

Jan 02, 2021 | 9:01 AM

ప్రస్తుతం కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. కరోనా సంక్షోభం థియేటర్లకు కలిసిరాకపోయిన ఓటీటీలకు మాత్రం

ఒడిస్సీ డ్యాన్సర్‏గా మారిన కాజోల్.. ఆసక్తికరంగా త్రిభంగా టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే..
Follow us on

ప్రస్తుతం కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. కరోనా సంక్షోభం థియేటర్లకు కలిసిరాకపోయిన ఓటీటీలకు మాత్రం బాగానే కలిసోచ్చింది. ఇటీవల ఇందులో విడుదలైన వెబ్ సిరీస్‏లు మంచి విజయం సాధించాయి. దీంతో తెలుగు, తమిళ, కన్నడ స్టార్స్‏తోపాటు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ వెబ్ సిరీస్‏లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజోల్ నటించిన ‘త్రిభంగా’ కూడా ఓటీటీ వేదికపై అలరించనుంది. కాజోల్ భర్త అజయ్ దేవ్‏గణ్ ఆల్కేమీ ఫిల్మ్స్‏తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రేణుక షహాణే దర్శకత్వం వహించారు.

నూతన సంవత్సర కానుగా త్రిభంగా టీజర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో కాజోల్ ఒడిస్సీ డ్యాన్సర్‏గా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి కాజోల్ మాట్లాడుతూ.. ముగ్గురు మహిళలకు సంబంధించిన ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రాబోతుంది. త్రిభంగా మూవీ ఈ జనవరి నెలలో విడుదలవుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులతోపాటు నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నా అంటూ చెప్పింది. ఇక ఈ నెల 15న నెట్‏ఫ్లిక్స్‏లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పనులన్ని ముగింపు దశకు చేరుకున్నాయి. ఒకే కుటుంబంలోని మూడు తరాల మహిళల చుట్టూ ఈ కథ ఉంటుందని తెలుస్తోంది.