తమిళ స్టార్ విజయ్ న్యూ మూవీ అప్‏డేట్.. ఆ డైరెక్టర్‏తో కలిసి మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన హీరో ?

|

Jan 21, 2021 | 2:39 PM

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా ఇటీవలె విడుదలై థియేటర్లలో కలెక్షన్లో కాసులు వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం

తమిళ స్టార్ విజయ్ న్యూ మూవీ అప్‏డేట్.. ఆ డైరెక్టర్‏తో కలిసి మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన హీరో ?
Follow us on

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా ఇటీవలె విడుదలై థియేటర్లలో కలెక్షన్లో కాసులు వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.  విజయ్ కెరీర్‏లో 64వ చిత్రంగా మాస్టర్ విడుదలైంది. అలాగే తన 65వ సినిమాను దిలీప్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలె ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా విజయ్ మరో ప్రాజెక్ట్‏కు కూడా ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది.

తమిళ హీరో కార్తీతో కలిసి ఖాకీ సినిమాను రూపొందించాడు హెచ్. వినోద్. అలాగే బాలీవుడ్‏లో హిట్ అయిన పింక్ సినిమాను తమిళంలో రీమేక్ చేశాడు వినోద్. తాజాగా ఈ సక్సె్స్ ఫుల్ డైరెక్టర్ విజయ్‏ను ఓ పొలిటికల్ స్టోరీని వినిపించాడట. కథ నచ్చడంతో విజయ్ ఓకే చెప్పినట్లుగా సమాచారం వినిపిస్తోంది. కానీ తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సద్దుమనిగే వరకు ఈ ప్రాజెక్టు‏ను వాయిదా వేస్తే బాగుంటుందని విజయ్ చెప్పినట్లుగా తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ వినోద్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‏తో కలిసి వాలిమై సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Also Read:

Pooja Hegde: దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అక్కడ అడుగుపెట్టేందుకు ‘బుట్టబొమ్మ’ రెడీ..!