వరుణ్ ఇంట్లో ఇల్లాలు ఈమెనే..! మరి వంటింట్లో..?

మంచి ఊర మాస్ సినిమాతో బౌన్స్‌బ్యాక్ అయ్యాడు మోగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్‌గా వరుణ్ పెర్ఫామెన్స్‌కి డిస్టెంక్షన్ మార్కులు పడిపోతున్నాయి. ఈ జోరుని ఎంజాయ్ చేస్తూనే.. వరుణ్ తేజ్ ఇద్దరి హీరోయిన్లపై చేసిన ఓ కామెంట్.. ఫిలిమ్ సర్కిల్స్‌లో బాగా చక్కర్లు కొడుతోంది. పెళ్లికి సాయి పల్లవి.. డేటింగ్ కోసమైతే పూజా హెగ్డే.. అనేది వరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్. ఈ మాటలో ఎంత ఖాస్ వుందో వేరే చెప్పక్కర్లేదు. ఓ టాక్‌ షోలో ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:30 pm, Mon, 23 September 19
వరుణ్ ఇంట్లో ఇల్లాలు ఈమెనే..! మరి వంటింట్లో..?

మంచి ఊర మాస్ సినిమాతో బౌన్స్‌బ్యాక్ అయ్యాడు మోగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్‌గా వరుణ్ పెర్ఫామెన్స్‌కి డిస్టెంక్షన్ మార్కులు పడిపోతున్నాయి. ఈ జోరుని ఎంజాయ్ చేస్తూనే.. వరుణ్ తేజ్ ఇద్దరి హీరోయిన్లపై చేసిన ఓ కామెంట్.. ఫిలిమ్ సర్కిల్స్‌లో బాగా చక్కర్లు కొడుతోంది.

పెళ్లికి సాయి పల్లవి.. డేటింగ్ కోసమైతే పూజా హెగ్డే.. అనేది వరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్. ఈ మాటలో ఎంత ఖాస్ వుందో వేరే చెప్పక్కర్లేదు. ఓ టాక్‌ షోలో ఈ విషయాన్ని చెప్పాడు. పెళ్లికైతే ఎవరు.. ఎఫైర్‌కైతే ఎవరు.. అనే ప్రశ్నకు వరుణ్ తడుముకోకుండా జవాబిచ్చాడు. ఛానొస్తే.. సాయిపల్లవిని మనువాడుతానని.. పూజాహెగ్డేతో రిలేషన్‌ పెట్టుకుంటానని వరుణ్ మనసులో మాట బైట పెట్టాడు.

మెగాప్రిన్స్ మన్‌కీ బాత్‌ని కాసేపు పక్కనబెడితే.. ఆ ఇద్దరు హీరోయిన్లతోనూ.. కెరీర్ పరంగా వరుణ్‌కి మంచి ఎటాచ్‌మెంటే వుంది. రీసెంట్ డేస్‌లో వరుణ్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చిన మూవీ ఫిదా. ఈ సాఫ్ట్ అండ్ స్వీట్ మూవీలో సాయిపల్లవితో వరుణ్ పండించిన కెమిస్ట్రీ.. కలెక్షన్లు కురవడానికి మెయిన్ రీజన్. అందుకేనేమో.. బాన్సువాడ భానుమతికి అలా ఓటేశాడు వరుణ్.

ఇక.. హీరోగా వరుణ్‌కి డెబ్యూ మూవీ ముకుంద. ఇందులో గోపికమ్మ పాత్రలో వరుణ‌్‌కి జోడీగా చేసింది పూజాహెగ్డే. ఇది ఐదేళ్ల నాటి ముచ్చట. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి జోడీ వాల్మీకి సినిమతో కుదిరింది. కనిపించింది కాసేపే ఐనా.. గద్దలకొండ గణేశ్‌కి బాగా కనెక్ట్ అయింది ఈ అమ్మడు. శ్రీదేవి-శోభన్ బాబు కాంబోని మళ్లీ గుర్తు చేశారంటూ కాంప్లిమెంట్లూ పడ్తున్నాయి.

తక్కువ స్పాన్ వున్న తన కెరీర్‌లో రెండు సినిమాల్లో చేసినందుకే పూజాలో రొమాంటిక్ టచ్‌కి ఫ్లాట్ అయ్యాడు వరుణ్. మొత్తానికి ఇద్దరు ముద్దుగుమ్మలపై వరుణ్ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది.