‘లా’కి ‘ఇజ్జత్’ ఇచ్చి ఫైన్ కట్టినం: హీరో రామ్

పబ్లిక్‌లో ధూమపానం(స్మోకింగ్) చేసినందుకు గానూ హీరో రామ్‌కు హైదరాబాద్‌ పోలీసులు రూ.200 ఫైన్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ సోమవారం చార్మినార్ పరిసరాల్లో జరిగింది. ఆ సమయంలో రామ్ పబ్లిక్‌గా స్మోక్ చేయడం గమనించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. ఈ వార్త కాస్త వైరల్‌గా మారడంతో తాజాగా దానిపై అతడు వివరణ ఇచ్చాడు. ‘‘నా టైమ్, పబ్లిక్ టైమ్ వేస్ట్ […]

‘లా’కి ‘ఇజ్జత్’ ఇచ్చి ఫైన్ కట్టినం: హీరో రామ్

Edited By:

Updated on: Jun 25, 2019 | 4:10 PM

పబ్లిక్‌లో ధూమపానం(స్మోకింగ్) చేసినందుకు గానూ హీరో రామ్‌కు హైదరాబాద్‌ పోలీసులు రూ.200 ఫైన్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ సోమవారం చార్మినార్ పరిసరాల్లో జరిగింది. ఆ సమయంలో రామ్ పబ్లిక్‌గా స్మోక్ చేయడం గమనించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. ఈ వార్త కాస్త వైరల్‌గా మారడంతో తాజాగా దానిపై అతడు వివరణ ఇచ్చాడు.

‘‘నా టైమ్, పబ్లిక్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేకనే రెస్మాండ్ గాలే. షాట్‌ ల కాల్చినా తమ్మి. బ్రేక్‌ ల కాదు. టైటిల్ సాంగ్‌ ల చూస్తావుగా స్టెప్పు. ఫిర్ బి ‘లా’కి ’ఇజ్జత్‘ ఇచ్చే ఫైన్ కట్టినమ్. గిప్పుడు నువ్వు కూడా నా లెక్క లైట్ తీస్కో పని చూస్తో- ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు. కాగా ఇస్మార్ట్ శంకర్ జూలై 18న విడుదల కానుంది. ఈ మూవీపై ఇటు రామ్, అటు పూరీ జగన్నాథ్ చాలా అంచనాలే పెట్టుకున్నారు.