OTT Movies: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం విడుదలయ్యే లిస్టు ఇదే..

|

Nov 15, 2022 | 4:59 PM

థియేటర్ల కంటే ఓటీటీల వైపే మొగ్గు చూపిస్తున్నారు. సమయం లేకపోవడమో లేక పెరిగిన టికెట్ రేట్ల కారణమో కొందరు ఇంట్లో కూర్చుని హాయిగా..

OTT Movies: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం విడుదలయ్యే లిస్టు ఇదే..
Ott Movies
Follow us on

ప్రస్తుతం చాలామంది ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. థియేటర్ల కంటే ఓటీటీల వైపే మొగ్గు చూపిస్తున్నారు. సమయం లేకపోవడమో లేక పెరిగిన టికెట్ రేట్ల కారణమో కొందరు ఇంట్లో కూర్చుని హాయిగా ఇంటిల్లపాది కొత్త సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రతీ వారం విడుదల చేస్తున్నాయి. ఇక ఈ వారం సినీ ప్రియులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఓటీటీలు ముస్తాబవుతున్నాయి. థియేటర్లలో హిట్ అయిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను రిలీజ్ చేయనున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి విడుదలయ్యే బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం!

  • అహ నా పెళ్లంట – 

రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’. దీనికి సంజీవరెడ్డి దర్శకత్వం వహించగా.. రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది.

  • సర్దార్ – 

కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు పిఎస్ మిత్రన్ కాగా.. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది సర్దార్ చిత్రం అటు తెలుగు, ఇటు తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ నెల18న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

  • గాడ్ ఫాదర్ –

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’కు ఇది తెలుగు రీమేక్. ఈ మూవీలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ రన్ ముగించకుని ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు/వెబ్ సిరీస్‌లు లిస్టు ఇదే..

  • అమెజాన్ ప్రైమ్ వీడియో:

హాస్టల్‌డేజ్‌ సీజన్‌-3 (వెబ్‌సిరీస్‌-హిందీ) నవంబర్ 16

ది సెక్స్‌లైవ్స్‌ ఆఫ్‌ కాలేజ్‌గర్ల్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబర్ 18

  • నెట్‌ఫ్లిక్స్‌:

ది వండర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16

1899 (హాలీవుడ్‌) నవంబరు 17

రిటర్న్‌ టు క్రిస్మస్‌ క్రీక్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

ఇలైట్‌ (హాలీవుడ్‌) నవంబరు 18

స్లంబర్‌ల్యాండ్‌( హాలీవుడ్‌) నవంబరు 18

  • డిస్నీ+ హాట్‌స్టార్‌

ఇరవతం (తమిళం/తెలుగు) నవంబరు 17

సీతారామం (తమిళం/తెలుగు) నవంబరు 18

  • సోనీ లివ్‌

అనల్‌ మీలే పని తులి (తమిళం) నవంబరు 18

వండర్‌ ఉమెన్‌ (తెలుగు) నవంబరు 18