‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇన్నోసెంట్ బ్యూటి హెబ్బా పటేల్. కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచింది . అయితే స్రిప్ట్స్ సెలక్షన్స్‌లో అమ్మడు తప్పటడుగులు వేయడంతో… ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. తాజాగా హెబ్బా మరో బోల్డ్ క్యారెక్టర్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ కిడ్నాప్ ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాడికల్. ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో హెబ్బా హీరోయిన్‌గా ఆడిపాడనుంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.