Hebah Patel as Radha: కరోనా లాక్‌డౌన్ సడలింపులతో టాలీవుడ్‌లో దాదాపుగా అందరు నటీనటులు సెట్స్ మీదకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌ల హడావిడి మొదలైంది. కేంద్రం విధించిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్రీకరణలను చేస్తున్నారు. ఇక మరోవైపు థియేటర్ల ఓపెనింగ్‌కి కూడా అనుమతి రావడంతో.. డిసెంబర్ లేదా జనవరి నుంచి పెద్దతెరపై సినిమాలు వచ్చే అవకాశం ఉంది. (శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న హర్యానా సీఎం.. ఐజీఎంసీకి తరలింపు)
ఇదిలా ఉంటే ఇవాళ దీపావళి సందర్భంగా పలు సినిమాల పోస్టర్‌లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తోన్న ఓదెల రైల్వే స్టేషన్ నుంచి హెబా పటేల్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో హెబా.. రాధ అనే పాత్రలో నటిస్తున్నారు. గ్రామీణ యువతిగా కట్టు బొట్టుతో, చేతిలో చాటతో డీగ్లామర్‌గా హెబా దర్శనమిచ్చారు. లుక్ చూస్తుంటే ఈ పాత్రలో హెబా ఒదిగిపోయినట్లుగా ఉంది. (ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్.. క్రేజీ పెయిర్‌ని సెట్ చేస్తోన్న మాటల మాంత్రికుడు..!)
కాగా ఈ మూవీలో వశిష్ట సిన్హా, సాయి రోనక్, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ మూవీకి కథను అందించగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. (కరోనాతో మృతి చెందిన భారతీయ సంతతి డాక్టర్.. నివాళులు అర్పించనున్న లండన్ ఆసుపత్రి)
"A rural girl with a TENDER heart and a SOLID spine". Introducing #HebahPatel As RADHA from #OdelaRailwayStation.#HappyDiwali@ImSimhaa #AshokTeja @soundar16 @pujita_ponnada @saironak3 @IamSampathNandi @anuprubens @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/v2tPt18KQQ
— BARaju (@baraju_SuperHit) November 14, 2020