చెన్నై: ‘మహా’ సినిమాతో ఇప్పటికే వార్తల్లో నానుతున్న హన్సిక సోషల్ మీడియాలో ఆసక్తిర పోస్ట్ పెట్టి మళ్లీ వార్తల్లోకెక్కింది. నేను, శింబు కలిసి మహాలో నటించబోతున్నట్టు వెల్లడించి షాకిచ్చింది. దీంతో ఇప్పుడిది సంచలనంగా మారింది. వీరిద్దరూ ఒక్కప్పుడు ప్రేమించుకుని, విభేదాల కారణంగా విడిపోయారంటూ చాలా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హన్సిక ఈ విధంగా పోస్ట్ పెట్టి ప్రకటన చేయడంతో మాజీ ప్రియుడితో కలిసి నటిస్తున్న ఆనందంలో హన్సిక మునిగిపోయిందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తెలుగులో తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన హన్సిక క్రమంగా ఎదుగుతూ తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారింది. తర్వాత అవకాశాలు తగ్గినప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. చాలా కాలం తర్వాత విడుదల కావాల్సిన మహ సినిమా వివాదాస్పదం కావడంతో మరోసారి అందులో ప్రధాన పాత్రలో నటించిన హన్సిక వార్తల్లోకి ఎక్కింది.
ఈ సినిమాలో శింబు ఒక అతిధి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. తమిళ ఇండస్ట్రీలో శింబుకు పాపులారిటీ ఉండటం, వీరిద్దరూ మాజీ లవర్స్ కావడంతో మహా సినిమాకు మరింత పాపులారిటీ లభించినట్లైంది. ఈ మహా సినిమా హన్సికకు 50వ చిత్రం కావడం మరో విశేషం.
Since the buzz is crazy and the news is leaked out way before time. Me and #STR are back in #MAHA ? pic.twitter.com/98WWdOg3Bu
— Hansika (@ihansika) March 6, 2019