AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani : ఎలాంటి డైట్ లేదు.. ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం అదే.. హన్సిక మోత్వానీ ఫిట్‌నెస్ సీక్రెట్స్..

కఠినమైన డైట్ నిబంధనలు పాటించకుండానే 34 ఏళ్ల వయసులో నటి హన్సిక మోత్వానీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తున్నారు. భారీ బరువులు ఎత్తడానికి దూరంగా ఉంటూ తాను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటానని ఈ సుందరి వెల్లడించారు. ఇంతకీ హాన్సిక పాటించే ఆ ఆహార నియమాలు ఏంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Oct 16, 2026 | 10:51 AM

Share
బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల తార హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో 'శాకా లకా బూమ్ బూమ్' సీరియల్ తో పాటు తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హన్సిక, ప్రస్తుతం 34 ఏళ్ల వయసులోనూ అంతే అందంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఆమె అంత ఫిట్‌గా ఉండటానికి ఎలాంటి కఠినమైన డైట్ లేదా వర్కౌట్లు ఫాలో అవుతుందనే విషయంపై తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

1 / 5
సాధారణంగా నటీమణులు అంటే కఠినమైన డైట్ చార్ట్స్, గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారని భావిస్తారు. కానీ హన్సిక మోత్వానీ మాత్రం తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో కానని స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాన్ని పంచుకుంటూ.. తాను ఫిట్‌గా ఉండటానికి ప్రధానంగా 'పిలేట్స్'  వర్కౌట్ ఎక్కువగా చేస్తానని తెలిపారు. శరీరాన్ని వంచడం, ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడం , కోర్ స్ట్రెంత్ కోసం పిలేట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.

2 / 5
సాంప్రదాయకంగా జిమ్‌లో చేసే హెవీ వెయిట్ లిఫ్టింగ్ కంటే తన సొంత శరీర బరువుతో చేసే వర్కౌట్లకే హన్సిక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉదయాన్నే నిద్రలేచి జిమ్‌కి జాగింగ్ చేస్తూ వెళ్లడం ఆమె దినచర్యలో భాగం. జిమ్‌లో బరువులు ఎత్తడం తనకు బోర్ కొడుతుందని, అందుకే బాడీ వెయిట్ ఎక్సర్‌సైజెస్‌తో పాటు స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి వాటిని తన రొటీన్‌లో చేర్చుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడి దూరమవుతుందని ఆమె వెల్లడించారు.

3 / 5
డైట్ చేయకపోయినా హన్సిక తన ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగి, ఆ తర్వాత పంచదార లేని గ్రీన్ టీ తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో పపాయా పండ్లు, మూడు ఎగ్ వైట్స్ ఆమ్లెట్, మల్టీగ్రేన్ టోస్ట్ తీసుకుంటారు. మధ్యాహ్నం పూట చాలా లైట్‌గా ఉడికించిన కూరగాయలను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

4 / 5
ఏదేమైనప్పటికీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కఠినమైన నిబంధనలు కాకుండా సరైన వ్యాయామం, సమతుల్య ఆహారమే ముఖ్యమని హన్సిక నిరూపిస్తున్నారు. ఆమె చివరిగా 2024లో విడుదలైన తెలుగు హారర్ థ్రిల్లర్ '105 మినిట్స్' , తమిళ హారర్ చిత్రం 'గార్డియన్' వంటి ప్రాజెక్టులలో కనిపించింది. తెలుగులో సరైన బ్రేక్ కోసం అలాగే.. కంబ్యాక్ ఇవ్వడానికి కరెక్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది హాన్సిక.

5 / 5
Follow Us