అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం రుద్రమాదేవి బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గుణశేఖర్ రానా, పూజా హెగ్డే కాంబీనేషన్లో హిరణ్యకశ్యప చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కానీ ఈ సినిమా చిత్రీకరణ కాస్తా ఆలస్యం అయ్యేలా ఉంది. ఇంతలో ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా డైరెక్టర్ గుణశేఖర్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా ఇప్పటికే ఈ దర్శకుడు తెలిపాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే.
శాకుంతలం సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది మొదటి రెండు, మూడు నెలల్లోనే ప్రారంభించాలని గుణశేఖర్ అనుకుంటున్నాడని సమాచారం. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నాడట గుణశేఖర్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంత వరకు తెలియని విషయం. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాడు. ఆల వైకుంఠపురం సినిమా భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఈ బుట్ట బోమ్మ వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారిపోయింది. అటు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించేందుకు కూడా ఈ భామ ఓకే చెప్తోంది. అంతేకాకుండా గుణశేఖర్ రూపొందించబోయే శాకుంతలం సినిమాకు ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు దీనిపై దర్శకుడు గుణశేఖర్ గానీ, పూజా హెగ్డే కానీ స్పందించలేదు. ఈ సినిమాలో నిజంగానే పూజా నటించబోతుందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.