సౌత్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ తన ‘పుష్ప’ ఫ్రాంచైజీకి సంబంధించిన ప్లాన్ గురించి గురించి మాట్లాడాడు. 2021లో పార్ట్ 1 విడుదలై ప్రేక్షకులను ఊహించనవిధంగా ఆకట్టుకుంది. అయితే ఆగస్ట్‌లో విడుదల కాబోతున్న ‘పుష్ప 2: ది రూల్’ గురించి అర్జున్ మాట్లాడుతూ “మీరు ఖచ్చితంగా పార్ట్ త్రీని ఆశించవచ్చు, మేం దానిని ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. పార్ట్- తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి” అని అల్లు అర్జున్ తెలిపారు. “అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం బెర్లిన్ యూరోపియన్ ఫిల్మ్ లో పుష్ప సినిమా ప్రదర్శించబడుతోంది. అయితే మొదటిసారి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.
“విదేశాల్లోని ప్రజలు ఈ చిత్రాన్ని ఎలా చూడబోతున్నారో చూడాలనుకుంటున్నా, భారతీయ సినిమాని ఎలా చూస్తారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా ఉన్నాయి. ఎలాంటి సినిమాలు చూస్తారు. అక్కడికి వచ్చే వ్యక్తుల ఆలోచన ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి’’ అని అన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ స్థాయికి ఎదిగి, పోలీసు అధికారిని ఏవిధంగా ఎదుర్కొనాడనే చూడొచ్చు.
“థియేట్రికల్ విడుదల సమయంలో చాలా మంది దీనిని ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పుష్ప సినిమాను చూశారు. కానీ ఇది అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఎక్కువస్థాయిలో చూశారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ కారణంగా, ఇతర భాషలు, చాలా మంది క్రాస్ఓవర్ ప్రేక్షకులు పుష్స సినిమాను చూశారు. ఇది 2021లో అతిపెద్ద చిత్రం. “అర్బన్ ఇండియన్స్ సినిమా చూసిన విధానానికి, విదేశాలలో ఉన్న వ్యక్తులకు పెద్దగా తేడా కనిపించలేదు. ఇండియాలోని సిటీ ప్రజలు ప్రపంచ ప్రేక్షకుల మాదరిగా ఆలోచిస్తారు అని ”అని అర్జున్ అన్నారు.
పుష్ప 2: ది రూల్’ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది. మీరు ‘పుష్ప 1’లో చూసిన దానికంటే ‘పుష్ప 2’ పుష్ప షేడ్‌లో చాలా భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. అయితే ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ ఏ ప్రాజెక్టును ఫైనల్ చేయలేదు. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నప్పటికీ ఫైనల్ చేయలేదు. ‘పుష్ప’ స్కేల్‌ను అస్సలు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. వీలైనంత వరకు పుష్ప సిరీస్ లోనే ఉంటా” అని అర్జున్ చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.