AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు వద్దన్నాడు బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమా కథను రిజక్ట్ చేశారట. కానీ అదే కథతో నటసింహం బాలకృష్ణ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. మెగాస్టార్, బాలయ్య ఇద్దరు సూపర్ స్టార్స్. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన సీనియర్ హీరోలు.  ఈ ఇద్దరూ తమ కెరీర్ లో చేయని పాత్ర లేదు అనే చెప్పులి. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ.

చిరు వద్దన్నాడు బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా ఎదో తెలుసా..
Chiranjeevi, Balakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2024 | 3:51 PM

Share

ఇండస్ట్రీలో ఒక హీరో వద్దనుకున్నా సినిమాలు మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డేట్స్ ఖాళీ లేకనో లేక కథ నచ్చకో సినిమాలు వదులుకొని ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయినప్పుడు బాధపడిన హీరోలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమా కథను రిజక్ట్ చేశారట. కానీ అదే కథతో నటసింహం బాలకృష్ణ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. మెగాస్టార్, బాలయ్య ఇద్దరు సూపర్ స్టార్స్. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన సీనియర్ హీరోలు.  ఈ ఇద్దరూ తమ కెరీర్ లో చేయని పాత్ర లేదు అనే చెప్పులి. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అయితే మెగాస్టార్ మిస్ చేసుకున్న సినిమా ను బాలయ్య చేసి హిట్ కొట్టారట.. ఆ సినిమా ఏదంటే..

ఒకప్పుడు సీనియర్ హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బీ గోపాల్. ఈ దర్శకుడు ఓ పవర్ ఫుల్ పోలీస్ కథతో మెగాస్టార్ దగ్గరకు వెళ్ళాడట. కథను కూడా వివరించాడట.. కానీ చిరు ఆ సినిమాను రిజక్ట్ చేశారట. ఆ సినిమానే రౌడీ ఇన్స్పెక్టర్.  విజయ్ శాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ కథ చెప్పే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారట. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకా ఆ సినిమా కథను సున్నితంగా తిరస్కరించారట. అయితే బీ గోపాల్ అదే కథను బాలకృష్ణ కు చెప్పి ఒప్పించారట. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఏకంగా 100రోజులు ఆడింది. ఆ తర్వాత బి గోపాల్ మెగాస్టార్ తో ఇంద్ర సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఇప్పుడు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. అటు బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

బాలకృష్ణ ఫ్యాన్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా