AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరివిడి లక్ష్మిలో అదిరే నటనతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌ అయిన రాగ్ మయూర్..

‘గరివిడి లక్ష్మి’ సినిమాలో సత్తిబాబు పాత్రలో రాగ్ మయూర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వయసుకు తగ్గ బాడీ లాంగ్వేజ్, విభిన్నమైన గెటప్స్, సహజమైన శ్రీకాకుళం యాసతో తనలోని నటనా వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఈ సినిమా రాగ్ మయూర్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలుస్తుందా?

గరివిడి లక్ష్మిలో అదిరే నటనతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌ అయిన రాగ్ మయూర్..
Rag Mayur
Praveen Vadla
| Edited By: |

Updated on: Oct 21, 2026 | 7:28 PM

Share

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ గట్టిగా వినిపిస్తోంది. అదే గరివిడి లక్ష్మి సినిమాలో రాగ్ మయూర్ పండించిన అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ గురించి. మామూలుగా ఒక యాక్టర్‌లో మాస్ మహారాజా రవితేజ లెవల్ ఎనర్జీతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ రేంజ్ వేరియేషన్స్ ఒకేసారి కనిపిస్తే థియేటర్లలో రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ కూడా అచ్చం అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసి టోటల్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, స్క్రీన్ మీద తను చూపించిన యాక్టింగ్ పొటెన్షియల్ చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా నిజంగానే సర్ప్రైజ్ అవుతున్నారు. తన కెరీర్‌కు ఈ ప్రాజెక్ట్ ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని క్రిటిక్స్ కూడా ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో సత్తిబాబు అనే పక్కా లోకల్ క్యారెక్టర్‌లో రాగ్ మయూర్ పూర్తిగా జీవించేశాడు అని చెప్పాలి. ఒకే మనిషిలో ఐదు రకాల డిఫరెంట్ డైమెన్షన్స్ చూపిస్తూ ఆడియన్స్‌కు ఒక సాలిడ్ యాక్టింగ్ ట్రీట్ ఇచ్చాడు.

క్యారెక్టర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ దానికి తగ్గట్లుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్న తీరు, అలాగే లుక్స్ పరంగా చేసిన మేకోవర్ చూస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. దీనికి తోడు కష్టమైన శ్రీకాకుళం స్లాంగ్‌ను ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా అనిపించకుండా చాలా నేచురల్ ఫ్లోలో డెలివరీ చేశాడు. అసలు తెర మీద మనకు కనిపిస్తున్నది రాగ్ మయూరా లేక రియల్ సత్తిబాబా అనే డౌట్ వచ్చేంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన మార్క్ చూపించాడు. సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ లుక్స్, ఫైట్స్ మాత్రమే అనే ఒక మూస పద్ధతి ఎప్పటినుంచో ఉంది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ కేవలం నటనకే ప్రయారిటీ ఉన్న ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ యాక్సెప్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గ్లామర్ పాత్రలకు దూరంగా, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా కోసం తను పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ క్లియర్‌గా ఎలివేట్ అవుతోంది. ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేయడం ద్వారా కమర్షియల్ సక్సెస్‌తో పాటు ఒక బ్రిలియంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఈ కుర్ర హీరో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరిన్ని అద్భుతాలు చేయడం గ్యారెంటీ అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోయారు.

Follow Us