పవన్ కల్యాణ్ ‘బద్రి’లో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? హీరోయిన్‌గా సినిమాలు కూడా చేసింది.. ఇప్పుడేమో..
ఈమెకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ , డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అలా ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆపై హీరోయిన్ గానూ కొన్ని సినిమాలు చేసింది.. కానీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బద్రి ఒకటి. డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2010లో రిలీజైన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ యూత్ ను తెగ నచ్చేసింది. ఇద్దరి అమ్మాయిలను ప్రేమించి వారి మధ్య నలిగిపోయే ఓ యువకుడిగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. అలాగే ‘నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రినాథ్’ అంటూ పవన్ చెప్పిన ట్రేడ్ మార్క్ డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాగా బద్రి సినిమాలో రేణూ దేశాయ్, అమిషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జున రావు, ఎంఎస్ నారాయణ, రమా ప్రభ, ఉత్తేజ్ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో బద్రి(పవన్ కళ్యాణ్) పార్క్ లో దిగులుగా కూర్చొని ఉంటాడు. ఆ టైములో ఓ పాప అతని వద్దకు వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు పవన్ కల్యాణ్.. ‘నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అని సమాధానం ఇస్తాడు. దానికి ఆ పాప ‘నాకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇస్తుంది. చిన్న వయసులోనే ఎంతో క్యూట్ గా ఆ పాప చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఆ పా మరెవరో కాదు ప్రముఖ నటుడు, కమెడియన్ ఉత్తేజ్ కూతురు.
కాగా ఉత్తేజ్ కూతురైన చేతన మొదటగా శ్రీకాంత్ నటించిన గిల్లి కజ్జాలు సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘బద్రి’, ‘చిత్రం’, ‘భద్రాచలం’, ‘పౌర్ణమి’ వంటి సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. 2017 లో వచ్చిన ‘పిచ్చి గా నచ్చావ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది చేతన. అటు తర్వాత ‘ప్యార్’ సినిమాలో కూడా కథానాయికగా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరైన చేతన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుది. వివిధ కారణాలతో పలు హిట్ సినిమాలు మిస్ అయ్యానని వాపోయింది. దృశ్యం’ సినిమాలో పెద్ద కూతురు పాత్ర చేసే అవకాశం వచ్చినప్పటికీ, హీరోయిన్‌గా ప్రయత్నిస్తున్న కారణంగా ఆ పాత్రను చేయలేకపోయానని బాధపడింది. ఆ పాత్ర చాలా బాగుంటుందని, సినిమాలో ఆ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందని ,అది ,మిస్ అయినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని పేర్కొంది.
ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ లో..
ఇక ప్రభాస్ గురించి మాట్లాడిన చేతన ‘ పౌర్ణమి’ సినిమాలో నటించే సమయంలో నాకు సుమారు 13 ఏళ్ల వయసు ఉంటుంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ నన్ను ఆటపట్టిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ, అప్పట్లో ఎలా పలకరించారో ఇప్పటికీ అలాగే ఆప్యాయంగా మాట్లాడుతారు. ఇదే ఆయన వ్యక్తిత్వంలో నాకు నచ్చిన గొప్ప లక్షణం’ అని చెప్పిన చేతన ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ లో తాను పనిచేస్తున్నానని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఉత్తేజ్ కూతురు చేతన..

Chetana Uttej
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




