AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటి చూపును మెరుగు పరిచే రుచికరమైన క్యారెట్ పప్పు.. అన్నం, చపాతీల్లోకి అదుర్స్

రోజూ ఇంట్లో చేసుకునే పాలకూర పప్పు, టమాటా పప్పు లేదా తోటకూర పప్పుల కంటే భిన్నంగా.. విటమిన్-ఏ, కంటి ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే క్యారెట్‌తో 'క్యారెట్ పప్పు' ఎంతో రుచికరంగా తయారుచేసుకోవచ్చు. చాలామంది క్యారెట్ తీపిగా ఉంటుంది కదా, పప్పులో వేస్తే తీపిదనం వస్తుందేమోనని సందేహిస్తుంటారు.

Phani CH
|

Updated on: Oct 21, 2026 | 6:21 PM

Share
కావలసిన పదార్థాలు: అర కప్పు కందిపప్పు ,  2 కప్పుల నీళ్లు, 2 మీడియం సైజు తాజా క్యారెట్లు, ముక్కలుగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, 7 నుండి 8  ఎండు మిరపకాయలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ వంట నూనె, రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1 చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు

1 / 5
తయారీ విధానం: కుక్కర్‌లో అర కప్పు కందిపప్పును వేసి నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కందిపప్పు కొలిచిన కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసిన 2 క్యారెట్లు, తరిగిన 2 టమాటాలు, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేయాలి. క్యారెట్ తీపిని డామినేట్ చేయడానికి 7 నుండి 8 తుంచిన ఎండుమిర్చి ముక్కలు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ నూనె వేసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి హై ఫ్లేమ్‌పై 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

2 / 5
కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీయాలి; పప్పు, క్యారెట్లు చక్కగా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. అయితే మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా అక్కడక్కడా చిన్న చిన్న క్యారెట్ పలుకులు కనిపించేలా మెదపడం వల్ల తినేటప్పుడు కమ్మగా తగులుతుంది. పప్పు సరైన కన్సిస్టెన్సీలో (మరీ చిక్కగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా) ఉండేలా చూసుకోవాలి.

3 / 5
స్టవ్‌పై చిన్న కడాయి పెట్టి 2 టీస్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, తుంచిన 1 ఎండుమిర్చి వేసి చిటపటలాడనివ్వాలి. పోపు వేగాక తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
 ఈ వేడి తాలింపును మెదిపి పెట్టుకున్న క్యారెట్ పప్పులో వేసి బాగా కలపాలి. కుక్కర్‌ను మళ్లీ స్టవ్‌పై పెట్టి మీడియం ఫ్లేమ్‌పై 2 నిమిషాలు ఉడికించాలి. పప్పు మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికించవచ్చు. అంతే, నోరూరించే కమ్మనైన 'క్యారెట్ పప్పు' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పుతో తిన్నా, చపాతీ లేదా పుల్కాల్లోకి నంజుకున్నా తీపి ఏమాత్రం తెలియకుండా అత్యంత అద్భుతమైన రుచితో తృప్తినిస్తుంది!

5 / 5
Follow Us