AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్ కృష్ణ ‘శక్తి’.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అరుదైన రికార్డులు!

1983లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ శక్తి చిత్రం భారీ విజయం సాధించింది. కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కింది. విజయవాడ, నెల్లూరులో అప్పటి రికార్డులను సృష్టించి, భారీ వసూళ్లను రాబట్టింది. నిర్మాత ఎం.ఎస్. రెడ్డికి నెల్లూరులో తొలి 100 రోజుల వేడుకను అందించిన ఘనత ఈ సినిమాకే దక్కింది.

సూపర్ స్టార్ కృష్ణ ‘శక్తి’.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అరుదైన రికార్డులు!
Shakti Movie
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2026 | 6:40 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 1983లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ‘అడవి సింహాలు’ ఒకటి కాగా.. ఆ తర్వాత ఐదు నెలల వ్యవధిలో విడుదలైన ‘శక్తి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వసూళ్లతో పాటు ప్రదర్శన పరంగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అంతకుముందు ‘ఊరికి మొనగాడు’ చిత్రాన్ని నిర్మించిన అడుసుమిల్లి గోపాలకృష్ణ.. ‘శక్తి’ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. సీత పాత్రలో జయసుధ నటించగా.. కృష్ణ సరసన రాధ నటించిన తొలి చిత్రంగా ‘శక్తి’ నిలిచింది. ఈ సినిమాలో రాధ గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. కృష్ణ నటన, రాఘవేంద్రరావు దర్శకత్వం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

1983 సెప్టెంబర్ 2న భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన ‘శక్తి’.. తొలి రోజుల్లోనే మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా విజయవాడలోని అప్సర థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శన సరికొత్త రికార్డును నెలకొల్పింది. తొలి నాలుగు వారాల పాటు హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో రూ.2,72,963 వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇక నెల్లూరులోని నర్తకీ థియేటర్‌లోనూ ‘శక్తి’ తన సత్తా చాటింది. తొలి వారంలోనే రూ.1,14,820 వసూలు చేసి ఆ ప్రాంతంలో అప్పటివరకు ఉన్న వసూళ్ల రికార్డులను తిరగరాసింది. ఈ స్థాయి వసూళ్లు సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచాయి.

నెల్లూరు ఏరియా హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత ఎం.ఎస్. రెడ్డికి ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘శక్తి’ వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడంతో నెల్లూరులో ఘనంగా శతదినోత్సవ వేడుకలను నిర్వహించే అవకాశం ఆయనకు దక్కింది. సోలో హీరోగా కృష్ణ నటించిన ఓ సినిమా వంద రోజుల వేడుక నెల్లూరులో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇలా ‘శక్తి’ సినిమా కృష్ణ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. అప్పటి థియేటర్లలో హౌస్‌ఫుల్ ప్రదర్శనలు, ప్రాంతాలవారీగా నమోదైన వసూళ్ల రికార్డులు, శతదినోత్సవ వేడుకలు.. ఈ చిత్ర విజయాన్ని చిరస్మరణీయం చేశాయి.

Follow Us
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు