
విశాఖ ఎయిర్‌పోర్ట్ లో మెగా పవర్ గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ షూటింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న చెర్రీకి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో హాజరై అభిమాన నటుడికి స్వాగతం పలికిన ఫ్యాన్స్ అనంతరం ఆయన వెంట ర్యాలీగా చెర్రీ బస చేస్తున్న హోటల్ వరకూ వెళ్లారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తీస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియార అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం చరణ్ ప్రస్తుతం విశాఖ చేరుకున్నారు.
గతంలోఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని బొబ్బర్లంకలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..