బాలీవుడ్ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ పెళ్లికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ హోటల్ వేదికగా మరికొన్ని గంటల్లో వీరు ఏడడుగులు నడవనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సహా మొత్తం 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రి వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ హోటల్‌కు అతిథులు ఒక్కొక్కరూ చేరుకుంటున్నారు. కాగా ఇప్పటికే దర్శకుడు కబీర్ ఖాన్ దంపతులు, నేహా ధూపియా దంపతులు, విజయ్ కృష్ణ ఆచార్య, శంకర్ మహదేవన్, ఎహ్‌సాన్ నూరానీ తదితర బాలీవుడ్ ప్రముఖులు హోటల్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
కాగా పెళ్లి వేడుకల్లో మెహందీ ఫంక్షన్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కత్రినా మెహెందీ వేడుకల కోసం సుమారు 20 కిలోల ఆర్గానిక్ హెన్నా పౌడర్‌ను ప్రత్యేకంగా తెప్పించారట. జోధ్‌పూర్ లోని పాలి జిల్లాలో ప్రత్యేకంగా తయారుచేసే ఈ హెన్నాను సోజత్ మెహెందీ అంటారు. ఈ క్రమంలో విక్ట్రీనా పెళ్లి వేడుకల కోసం మెహెందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్‌లను పంపించారట. కాగా ఈ ఆర్గానిక్ మెహెందీ పౌడర్‌ను తయారుచేయడానికి సుమారు 20 రోజులు పడుతుందట. ఈ హెన్నా సహజ సిద్ధంగా తయారవుతుందని, ఎటువంటి రసాయనాలు మిక్స్ చేయరని.. అందుకే దీని తయారీకి రూ. 50వేల నుంచి రూ.1 లక్ష ఖర్చు అవుతుందని సోజత్ మెహెందీ తయారీ కంపెనీ ‘నేచురల్ హెర‍్బల్’ యజమాని నితేష్ అగర్వాల్ చెబుతున్నారు. అయితే హెన్నాను తయారుచేసేందుకు గాను సెలబ్రిటీ కపుల్స్ నుంచి ఆయన ఒక్క పైసా కూడా తీసుకోడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: