AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song : ఏముంది భయ్యా ఈ పాట.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఫోక్ సాంగ్.. విడుదలైన గంటల్లోనే సెన్సేషన్..

తెలంగాణ ఫోక్ పాటలు ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నో పాటలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ మాత్రం విడుదలైన గంటల్లోనే సంచలనంగా మారింది. సాంగ్ మాస్ వైబ్ మాత్రం యూత్ ఎంజాయ్ చేస్తున్నారు.

Folk Song : ఏముంది భయ్యా ఈ పాట.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఫోక్ సాంగ్.. విడుదలైన గంటల్లోనే సెన్సేషన్..
Folk Song
Rajitha Chanti
|

Updated on: Feb 27, 2026 | 6:46 PM

Share

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ లెవల్లో ఈ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. రాను బొంబాయికి రాను అంటూ ప్రపంచం దృష్టిని తెలంగాణ పల్లె పాటల వైపు చూసేలా చేశాడు రాము రాథోడు. కొన్నాళ్లుగా తెలంగాణ పల్లె పాటలు అటు సెలబ్రెటీలను సైతం ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ఈ పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్ద సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పల్లె జానపదాలకు కాలు కదుపుతున్నారు. అయితే తాజాగా ఓ సాంగ్ మాత్రం ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన గంటల్లోనే యూట్యూబ్‌లో విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఫోక్ సింగర్ మధుప్రియ, నాగవ్వ అద్భుతమైన గాత్రాలతో సాగే ఈ పాట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫోక్ సాంగ్ పేరు “మామిడి కోనల మీన” అంటూ ఈ పక్కా ఫోక్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మాయి తనకు కాబోయే భర్త గురించి కలలు కంటూ.. అతడి గురించి ఆలోచనలను పంచుకునే లిరిక్స్ యూత్ కు కనెక్ట్ అవుతున్నాయి. ఇటీవల మంగ్లీతో కలిసి బాయిలోనా బల్లిపలికే పాటతో పాపులర్ అయిన సింగర్ నాగవ్వతోపాటు సింగర్ మధుప్రియ కలిసి ఈ పాటను మరింత అద్భుతంగా పాడారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

కమల్ ఎస్లావత్ సాహిత్యం అందించిన ఈ పాటకు కళ్యాణ్ సంగీతం అందించారు. ఇక ఇందులో ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ మరోసారి తనదైన చూడముచ్చటైన డ్యాన్స్, లుక్స్ తో ఆకట్టుకుంది. శేఖర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం యూట్యూబ్ లో సెన్సేషన్ అవుతున్న ఈ సాంగ్ మీరు విన్నారా.. ?

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us