FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..

|

Feb 03, 2022 | 10:22 PM

FIR Trailer: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ఐఆర్‌. మంజిమ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి..

FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..
Follow us on

FIR Trailer: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ఐఆర్‌. మంజిమ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న తరుణంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. సినిమా ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేయడం విశేషం. ఇక రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను గమనిస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ సినిమా ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఓ ఐఎస్‌ఎస్‌ ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో అధికారులు అమాయక వ్యక్తిని (హీరోను) పట్టుకుంటారు. దేశమంతా అతనిపై ఒక టెర్రరిస్ట్‌, దేశ ద్రోహి అనే ముద్ర వేస్తుంది. తాను నిర్ధోషినని ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఆ వ్యక్తి పోలీసులు, అధికారులపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్న కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక అసలు ఉగ్రవాది ఎవరు.? హీరోను ఎందుకు ఇరికించాడు, చివరికి హీరో ఉగ్రవాదిని దొరికబట్టి నిర్ధోషిగా బయటపడతాడా.? తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతహ వాసుదేవ్‌ మీనన్‌ పోలీసు అధికారిక పాత్రలో నటించడం విశేషం. మరి ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Nani: మీరు రెండు డేట్లు ఫిక్స్‌ చేస్తే.. మేం ఏడు డేట్లు బ్లాక్‌ చేస్తాం.. తన సినిమాకు ఏడు విడుదల తేదీలను ప్రకటించిన నాని..

Neha Shetty: యూత్ న్యూ క్రష్ గా మారుతున్న ‘నేహా శెట్టి’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్…

Pakistan: చైనా పర్యటనకు ముందు పాక్ లోని రెండు సైనిక స్థావరాలపై ఉగ్రమూకల దాడి.. వందమంది సైనికులు మృతి..