Prabhas Salaar: ‘సలార్’ కటౌట్‌కి సరైన విలన్ దొరికేశాడట! దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏం చెబుతున్నారంటే..
Prabhas Salaar: బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్‌డమ్ వచ్చేసింది. దీంతో ప్రభాస్‌తో
Prabhas Salaar: బాహుబలి సినిమాతో ప్రభాస్ కెరీర్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్‌డమ్ వచ్చేసింది. దీంతో ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి దర్శకులు వరుసగా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా శ్రుతి హాసన్ హీరోయిన్‌గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భీకర యాక్షన్ డ్రామాలో ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్‌ను మ్యాచ్ చెయ్యగలిగే విలన్ ఎవరు అనే టాక్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ వ్యక్తి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నారని తెలుస్తోంది. కానీ ఇపుడు అంతర్గత సమాచారం ఏంటంటే దర్శకుడు నీల్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హ్యాపెనింగ్ విలన్‌నే తీసుకున్నట్టు తెలుస్తోంది.
అతడే మధు గురు స్వామి. కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న ఈ సాలిడ్ కటౌట్‌ను ప్రభాస్‌కు సమఉజ్జీగా ప్రశాంత్ నీల్ బరిలో దింపనున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి చాలా మేర కేజీయఫ్ టెక్నిషియన్సే పని చేస్తుండగా హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తోందో అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ ‘ఆదిపురుష్’లో భాగం కానున్న లెజండరీ క్రికెటర్ తనయుడు.. ‘ఇంద్రజిత్’గా బాలీవుడ్ నటుడు