
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నారని.. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారనే ఆరోపణలతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ నెల 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం( 28)వ తేదీన విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం మహేశ్ బాబు సోమవారం ఉదయం 10:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మహేష్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేఖపోతున్నట్టు ఆయన ఆదివారం ఈడీ అధికారులకు లేఖ రాశారు.
ముందే షెడ్యూల్ చేసుకున్న ప్రకారం సోమవారం షూటింగ్ ఉండడంతో తాను విచారణకు హాజరుకాలేకపోతున్నానని మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. అందువల్లే విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు మహేశ్ బాబు లేఖలో పేర్కొన్నారు. విచారణకు మరో తేదీని కేటాయించాలని మహేష్ బాబు ఈడీ అధికారులను కోరినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…