జూనియర్ ఆర్టిస్టులను..టెర్రరిస్టులు అనుకుని

| Edited By: Srinu

May 29, 2019 | 6:13 PM

ముంబయి: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ఓ సినిమా సెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. సినిమాలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఉగ్రవాదుల పాత్రలు పోషిస్తున్నారు. దాంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్‌లు ధరించి, సూసైడ్‌ బాంబర్స్‌ గెటప్‌ను వేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఇద్దరూ అవే గెటప్‌లతో పక్కనే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. వారిని చూసిన స్థానికులు ఉగ్రవాదులు అనుకుని భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే […]

జూనియర్ ఆర్టిస్టులను..టెర్రరిస్టులు అనుకుని
Follow us on

ముంబయి: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ఓ సినిమా సెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. సినిమాలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఉగ్రవాదుల పాత్రలు పోషిస్తున్నారు. దాంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్‌లు ధరించి, సూసైడ్‌ బాంబర్స్‌ గెటప్‌ను వేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఇద్దరూ అవే గెటప్‌లతో పక్కనే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. వారిని చూసిన స్థానికులు ఉగ్రవాదులు అనుకుని భయబ్రాంతులకు గురయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తాము జూనియర్‌ ఆర్టిస్ట్‌లమని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. విషయం నిర్మాతల దృష్టికి రావడంతో వారు వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వారు జూనియర్‌ ఆర్టిస్ట్‌లని ఆధారాలు చూపించిన తర్వాతే పోలీసులు వారిని వదిలేశారు. ఈ ఘటనతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సినిమాలో హృతిక్‌తో పాటు టైగర్‌ ష్రాఫ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.