F3 Collection: నవ్వుల వానే కాదు, వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఎఫ్‌3.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

|

May 30, 2022 | 8:46 PM

F3 Collection: 'ఎఫ్‌3' సినిమా థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటు వసూళ్ల వర్షం కూడా కురిపిస్తోంది. అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ, విక్టరీ వెంకటేష్‌ల నటన ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. గత శుక్రవారం (మే 27) రోజుల విడుదలైన ఈ సినిమా...

F3 Collection: నవ్వుల వానే కాదు, వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఎఫ్‌3.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
F3 Movie
Follow us on

F3 Collection: ‘ఎఫ్‌3’ సినిమా థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటు వసూళ్ల వర్షం కూడా కురిపిస్తోంది. అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ, విక్టరీ వెంకటేష్‌ల నటన ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. గత శుక్రవారం (మే 27) రోజుల విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 63.5 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఎఫ్‌3 సినిమాకు ప్రస్తుతం మరే సినిమా పోటీ లేకపోవడం ఈ సినిమా కలెక్షన్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. అలాగే మళ్లీ వచ్చే వీకెండ్‌ వరకు ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఎఫ్‌3 కలెక్షన్లు స్టడీగా కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆదివారం రోజే రూ. 8.87 కోట్ల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ వసూలు చేసింది. ఇక ఓవర్‌సీస్‌లోనూ ఎఫ్‌3 రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.

విదేశాల్లో ఇప్పటి వరకు రూ. 7 కోట్లుకుపైగా వసూలు చేసింది. మరి ఈ వారంతంలో ‘ఎఫ్‌3’ క్లోజింగ్ కలెక్షన్లు ఎంత ఉంటాయో చూడాలి. ఇదిలా ఉంటే ఎఫ్‌2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇందులో సునీల్‌, అలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..