షూటింగ్ పూర్తిచేసుకున్న ‘హే సినామిక’.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్ర యూనిట్ ఫొటోలు..

|

Dec 28, 2020 | 1:14 PM

మళయాల యువ హీరో దుల్కర్ సల్మాన్‌, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి నటిస్తున్న హే సినామిక చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది.

షూటింగ్ పూర్తిచేసుకున్న హే సినామిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్ర యూనిట్ ఫొటోలు..
Follow us on

మళయాల యువ హీరో దుల్కర్ సల్మాన్‌, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి నటిస్తున్న హే సినామిక చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెట్‌లో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ హే సినామిక మేక‌ర్స్ ఈ విష‌యాన్ని వెల్లడించారు. జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్న తొలి తమిళం చిత్రం హే సినామిక ప్రత్యేక గుర్తింపు సాధించింది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ విషయానికొస్తే పెళ్లి తర్వాత ఈ భామ వరుస సినిమాలతో దూసుకెళుతుంది. 35 సంవత్సరాలున్న ఈ అమ్మడు, తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతో పాటు అటు కుర్ర హీరోలు, ఇటు సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో కాజల్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో అతడు మిలిటరీ మ్యాన్‌గా కనిపించనున్నారు.