
ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించొద్దంటూ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కాదని ఎక్కడైనా సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆర్వోలు, ఎస్పీలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవో సహా 66మంది తహశీల్దార్లకు ఆయన ఆదేశాలు పంపారు. జిల్లాలోని థియేటర్లన్నీ ఈ ఆదేశాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్న అందులో పేర్కొన్నారు.