
దక్షిణాది చిత్రపరిశ్రమలో 1990వ దశకంలో తన సహజమైన అందం, అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి సితార. అప్పట్లో కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా వెలుగొందిన ఆమె, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తూ సినిమాలకు కొద్దిగా దూరం కావడం, ఇప్పటికీ 52 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుండటం వెనుక ఉన్న అసలు కారణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కేరళకు చెందిన సితార 1986లో విడుదలైన మలయాళ చిత్రం ‘కావేరి’ ద్వారా బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటుల సరసన నటించి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పుదుపుతు అర్థంగల్’ ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ చిత్రంలో ఆమెపై వచ్చిన ‘కేలడి కన్మణి’ పాట ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ అగ్ర హీరోల సరసన నటిస్తూ వరుస హిట్లు అందుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
అయితే కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఆమె జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. తండ్రి ఆకస్మిక మరణం సితార కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. పెద్ద కుమార్తెగా కుటుంబ బాధ్యతలు మొత్తం ఆమె భుజాన వేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తన తమ్ముడిని బాగా చదివించి డాక్టర్‌ను చేయాలన్న తండ్రి కల నెరవేర్చడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. ఈ కుటుంబ బాధ్యతలు, తమ్ముడి భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణంలో ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని, వివాహాన్ని పూర్తిగా పక్కన పెట్టవలసి వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
కాలక్రమేణా కథానాయికగా అవకాశాలు తగ్గినప్పటికీ, సితార వెనుకంజ వేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఇప్పటి యంగ్ హీరోలకు తల్లిగా, వదినగా, పిన్నిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తెలుగు, తమిళ తెరపై ఇప్పటికీ బిజీ నటిగా కొనసాగుతున్నారు. సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, ఒంటరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార ప్రస్తుతం బిజీ ఆర్టి్స్టుగా కొనసాగుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
Sitara Life
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..