
హారర్ సినిమాలు చూడడం అంటే మీకు ఇష్టమా.. ? అయితే మీరు ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. దెయ్యాల ఫామ్ హౌస్.. ఎంతో ధైర్యం ఉన్న జంట.. అనుక్షణం ఉత్కంఠ, భయంతో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. శపించబడిన వస్తువులు దయ్యాల అస్తిత్వాలు, నమ్మకం, భయం మధ్య జరిగే సంఘటనలతో ఈ మూవీ ఉంటుంది. ఆ సినిమా పేరు ది కంజురింగ్. 2013లో విడుదలైన ఈ మూవీ నిజ జీవిత పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ (పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా పోషించారు). పెర్రాన్ కుటుంబానికి వారి రోడ్ ఐలాండ్ ఫామ్ హౌస్ లో దెయ్యాల ఉనికి ఎదుర్కొవడంలో సహయపడడమే ఈ చిత్రం. జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది.
ది కంజురింగ్.. మొత్తం నాలుగు భాగాలుగా తెరకెక్కించారు. 2013 నుంచి 2025 వరకు నాలుగు భాగాలు విడుదలయ్యాయి. 2013 తర్వాత 2016లో ది కంజురింగ్ 2 విడుదలైంది. లండన్ కు చెందిన వారెన్స్ ఎన్ ఫీల్డ్ ఫోల్టర్జిస్ట్ ను పరిశోధించారు. ఇందులో వాలక్ అనే రాక్షసుడి గురించి తెలియజేసింది. ఆ తర్వాత 2021లో విడుదలైన ది కంజురింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ మరో మలుపు తిరిగింది. 1981లో ఆర్నే జాన్సన్ పై జరిగిన నిజమైన విచారణను ఈ సినిమా చూపిస్తుంది. ది కంజురింగ్ యూనివర్స్ మొత్తం 1817 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. రూ.17400 కోట్లకు పైగా వసూలు చేసింది.
కంజురింగ్ యూనివర్స్ ను సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, శాశ్వతమైన హర్రర్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ యూనివర్స్ లో చివరి భాగమైన ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?