అమ్మబాబోయ్..! స్టార్ హీరోయిన్స్ బీట్ చేసేలా అజిత్ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సికింద్రాబాద్ కుర్రోడు తమిళ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అతనే అజిత్. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అజిత్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అజిత్ సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే పివి సింధు పెళ్లికి స్టార్ హీరో అజిత్ తన ఫ్యామిలితో హాజరయ్యాడు. అజిత్ తన భార్య, కుమార్తె, కొడుకుతో కలిసి సింధు పెళ్లికి హాజరైన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్‌లో స్టార్ నటుల్లో అజిత్ ఒకరు. అజిత్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అజిత్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అజిత్ ప్రస్తుతం మీజ్ తిరుమేని దర్శకత్వంలో ఓ చిత్రం అలాగే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీలో నటిస్తున్నాడు. అజిత్ సినిమాల్లో నటిస్తున్న మధ్యలో కార్ రేసింగ్ పై కూడా దృష్టి పెట్టడం గమనార్హం.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఇదిలా ఉంటే తాజాగా అజిత్ కూతురు అందరి ధృష్టిని ఆకర్షిస్తుంది. అజిత్ కూతురు పేరు అనౌష్క. అజిత్ కూతురు ప్రస్తుతం విదేశాల్లోనే చదువుకుంటున్న సంగతి తెలిసిందే.. అయితే ఆమె త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనౌష్క ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని చూస్తుందట. త్వరలోనే నిర్మాణ రంగంలోకి ఈ చిన్నది ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట. అయితే ఆమె లుక్ స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా ఉండటంతో అందరూ ఆమె హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్
అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విదాముయార్చి. ఈ సినిమా షూటింగ్ గతేడాదిలో ప్రారంభమై కొన్ని నెలలపాటు శరవేగంగా జరిగినప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలల క్రితమే షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలోనే అజిత్ తదుపరి చిత్రానికి కమిట్ అయ్యాడు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ సినిమాలో జాయిన్ అయ్యి షూటింగ్ లో బిజీ అయిపోయాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి అనే రెండు చిత్రాలు పొంగల్‌కు విడుదల కానున్నాయని సమాచారం. దీంతో అజిత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.