Trivikram : నా కష్టా సుఖాల్లో ఎప్పుడూ నాతోనే ఉన్నాడు.. ఇప్పటికీ ఏదైనా బాధ వస్తే అతడికే చెప్పుకుంటా..

దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు నేడు (నవంబర్ 7). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో గతంలో ఓ సినిమా వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ తన నిజమైన స్నేహితుడి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన కష్టసుఖాల్లో ఎప్పుడూ తన వెంటే ఉన్నాడని.. ఇప్పటికీ తన భాధను అతడితోనే పంచుకుంటానని అన్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Trivikram : నా కష్టా సుఖాల్లో ఎప్పుడూ నాతోనే ఉన్నాడు.. ఇప్పటికీ ఏదైనా బాధ వస్తే అతడికే చెప్పుకుంటా..
Trivikram

Updated on: Nov 07, 2026 | 12:45 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్స్ ఆయన సినిమాల్లో స్పెషల్. ఈరోజు (నవంబర్7) త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అదేంటంటే… ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. అలాగే త్రివిక్రమ్ సైతం గతంలో తన నిజమైన స్నేహితుడి గురించి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రముఖులలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ కంటూ హీరోగా మారిన సునీల్ జోడీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం ఇండస్ట్రీ రిలేషన్‌షిప్ మాత్రమే కాదు, దశాబ్దాల కాలంగా ఎన్నో కష్టసుఖాలను పంచుకున్న నిజమైన స్నేహబంధం. ఒక సినిమా వేడుకలో త్రివిక్రమ్ సునీల్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

సునీల్ గురించి తాను చాలా ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడనని, ఎందుకంటే తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టుకోవడం తనకు ఇష్టం ఉండదని త్రివిక్రమ్ తెలిపారు. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని తరచూ అందరి ముందు చెప్పుకోవడం వల్ల ఆ బంధం పల్చబడిపోతుందనే భయం తనకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకుంటామని, ఏ విజయాన్నయినా, బాధనైనా కలిసి దాటుతామని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

సునీల్ తన జీవితంలో ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడని త్రివిక్రమ్ పేర్కొన్నారు. పంజాగుట్టలోని ఒక ప్రత్యేకమైన గదిని గుర్తుచేసుకుంటూ, తమ ఇద్దరికీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అక్కడే కలుస్తామని, అన్ని విజయాలు, దుఃఖాలు అక్కడి నుంచే పంచుకున్నామని తెలిపారు. అద్దంలో తన గురించి తాను మాట్లాడుకున్నట్లే సునీల్ గురించి మాట్లాడడం ఉంటుందని, అందుకే ఇకపై సునీల్ గురించి మాట్లాడనని త్రివిక్రమ్ అన్నారు. సునీల్ మళ్లీ తన జూలు విదిలించి, పూర్వవైభవాన్ని పొందాడని, ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

త్రివిక్రమ్, సునీల్..

Trivikram, Sunil

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us