ఆ సినిమా టీజర్‏ను రిలీజ్ చేసిన త్రివిక్రమ్.. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్‏లో చిత్రం.. రెస్పాన్స్ సూపర్..

|

Dec 17, 2020 | 6:39 PM

ప్రముఖ నటుడు శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిస్ట ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ప్లాన్-బి. ఈ సినిమాలో డింపుల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు రాజమహి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఆ సినిమా టీజర్‏ను రిలీజ్ చేసిన త్రివిక్రమ్.. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్‏లో చిత్రం.. రెస్పాన్స్ సూపర్..
Follow us on

ప్రముఖ నటుడు శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిస్ట ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ప్లాన్-బి. ఈ సినిమాలో డింపుల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు రాజమహి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మురళీ శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్ధార్ కీలక పాత్రలు పొషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‏ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ విడుదల చేశారు. టీజర్ చాలా ఉత్కంఠభరితంగా ఉందని, ఈ సినిమా మంచి విజయం సాధించి.. చిత్రయూనిట్‏కు మంచి పేరు రావాలని త్రివిక్రమ్ మూవీ టీంను అభినందించారు.

ఈ సందర్భంగా ఆ చిత్ర డైరెక్టర్ కెవి రాజమహి మాట్లాడుతూ.. “మొదటి మీటింగ్‏లోనే నా మీద నమ్మకంతో ఈ సినిమాకు ఓకే చెప్పి, నాకు అవకాశం కల్పించిన నిర్మాత ఎవిఆర్ గారికి నా ధన్యావాదలు. అలాగే కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట ఇందులో చాలా బాగా నటించారు. విభిన్నమైన పాత్రల్లో మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ నటించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‏గా రాబోతున్న మా సినిమాలో కునాల్ శర్మ విలన్ పాత్రలో నటించారు. మేము అడిగిన వెంటనే మా సినిమా టీజర్‏ను విడుదల చేసిన త్రివిక్రమ్ గారికి మా కృతజ్ఞతలు. సినిమా టీజర్ చాలా బాగా వచ్చింది. నన్ను నమ్మి, నాకు సపోర్ట్ చేసిన అందరికి నా థాంక్స్” అని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. తొందర్లోనే అన్ని పనులు పూర్తిచేసి ప్లాన్-బి సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చిత్ర నిర్మాత ఎవిఆర్ అన్నారు.