RRR Movie: భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు రాజమౌళి (Rajamouli). ఈ దర్శకధీరుడు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. కెరీర్ తొలినాళ్లలో కాస్తోకూస్తో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించిన జక్కన్న ‘మగధీర’ తర్వాత చేసిన సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్‌వే. జక్కన్న సినిమాల్లో నటించే యాక్టర్ల రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. అలాగే సినిమా చిత్రీకరణ కోసం వేసే సెట్స్ కూడా భారీగానే ఉంటాయి. అయితే మగధీర తర్వాత ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు చేయనని, తక్కువ సమయంలో సినిమాలు పూర్తి చేస్తానని జక్కన్న అప్పట్లో తెలిపారు. అయితే ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ చిత్రాల సమయాల్లో చెప్పిన మాటపై నిలబడ్డ రాజమౌళి మళ్లీ బాహుబలితో మళ్లీ తన మార్గంలోకే వెళ్లిపోయారు.
ఇక తాజాగా తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) విషయంలోనూ బడ్జెట్ గోడలను బద్దలు కొట్టేశారు. ఏకంగా రూ. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా తర్వాత తెరకెక్కనున్న మహేష్ బాబు సినిమాను కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించనున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. భారీ బడ్జెట్ సినిమాలు తీయనన్ని చెప్పి మళ్లీ ఎందుకు తీస్తున్నారన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాదానం ఇచ్చారు జక్కన్న.
ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ.. ‘మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ రోజులు షూటింగ్ చేయకూడదని అనుకున్నాను. అనుకున్నట్టే ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ సినిమాలు చేశాను. కానీ ‘బాహుబలి’ సినిమా అలా చేయడం నా వల్ల కాలేదు. ఈ విషయంలో మాట తప్పింది నిజమే. కానీ అందుకు రామ్ గోపాల్ వర్మను స్ఫూర్తిగా తీసుకొని అబద్దం చెప్పాను’ అంటూ చమత్కరించారు రాజమౌళి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పలుసార్లు తాను ఇచ్చిన స్టేట్‌మెంట్స్ విషయంలో అబద్దం చెప్పాను అంటూ ట్వీట్స్ చేసిన విషం తెలిసిందే.
Also Read: Viral Video: చేతిలో సిగరెట్.. మరో చేతితో పాము.. ఈ యువతి స్టైల్ చూస్తే మతిపోవాల్సిందే.!
ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Stock Markets: బంపర్ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. తిరిగి వస్తున్న విదేశీ మదుపరులు..