Puri Jagannadh: పూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. ఎట్టకేలకు ‘జన గణ మన’పై అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఆడియో వైరల్‌..

|

Feb 07, 2022 | 8:52 AM

Puri Jagannadh: టాలీవుడ్‌ క్రేజీ దర్శకుల్లో పూరి జగన్నాధ్‌ ఒకరు. పోస్టర్‌పై దర్శకుడి పేరు చూసి సినిమాకు వెళ్లే అతికొద్ది మందిలో పూరి ఒకరు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో చూపించే పూరితో ఒక్క సినిమా అయినా చేయడానికి హీరోలు సైతం ఎదురుచూస్తుంటారని..

Puri Jagannadh: పూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. ఎట్టకేలకు జన గణ మనపై అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఆడియో వైరల్‌..
Follow us on

Puri Jagannadh: టాలీవుడ్‌ క్రేజీ దర్శకుల్లో పూరి జగన్నాధ్‌ ఒకరు. పోస్టర్‌పై దర్శకుడి పేరు చూసి సినిమాకు వెళ్లే అతికొద్ది మందిలో పూరి ఒకరు. హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో చూపించే పూరితో ఒక్క సినిమా అయినా చేయడానికి హీరోలు సైతం ఎదురుచూస్తుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇలాంటి దర్శకుడు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చితే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్‌కు పండగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదూ.! అలాంటి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘జన గణ మన’. ఈ సినిమా కోసం పూరి ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. కాగా.. తొలిసారి పూరి ఈ సినిమాపై అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పూరి, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్‌ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా షూటింగ్‌ ఆదివారంతో ముగిసింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూరి ఓ ఆడియోను విడుదల చేశారు. ‘ఈ రోజుతో లైగర్ షూటింగ్‌ పూర్తయింది. ఇక ఇప్పటి నుంచి ‘జన గణ మన” అంటూ పూరి చెప్పుకొచ్చారు. ఈ ఆడియోను నటి ఛార్మి పోస్ట్‌ చేశారు. దీంతో పూరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. పూరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందన్న వార్త వారిలో జోష్‌ను నింపేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మొదట్లో పూరి ఈ సినిమాను పవన్‌ కళ్యాణ్‌తో తెరకెక్కించునన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మహేష్‌ నటించనున్నారని వార్తలు వినిపించాయి. దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా వీరిద్దరు కాకుండా విజయ్‌ దేవరకొండ హీరోగా ‘జన గణ మన’ రానుందనే కొత్త వార్త వినిపిస్తోంది. మరి ఇంతకీ ఈ చిత్రంలో ఎవరు నటించనున్నారనే సస్పెన్స్‌కు తెరపడాలంటే పూరి అధికారికంగా స్పందించాల్సిందే.

Also Read: Medaram: తెలంగాణ కుంభమేళాకు సర్కార్ భారీ ఏర్పాట్లు.. మేడారం మహా జాతరకు అధికారిక సెలవులు దక్కేనా?

Liquor Bottles: అక్కడి శ్మశానంలో కుప్పలు తెప్పలుగా మద్యం బాటిల్స్‌.. ఎక్కడి నుంచి వచ్చాయంటే..?

Liquor Bottles: అక్కడి శ్మశానంలో కుప్పలు తెప్పలుగా మద్యం బాటిల్స్‌.. ఎక్కడి నుంచి వచ్చాయంటే..?