Mani ratnam: అంతా మన మంచికే అంటోన్న మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్‌కు అదే కలిసొచ్చిందంటూ..

|

Oct 04, 2022 | 7:33 AM

'ఆలస్యం.. అమృతం.. విషం' ఈ సామెత మనందరికీ తెలిసిందే. ఆలస్యమైతే అమృతం కూడా విషంలా మారుతుందని దీని అర్థం. కానీ తన విషయంలో మాత్రం ఆలస్యమే మంచి చేసిందని చెబుతున్నారు..

Mani ratnam: అంతా మన మంచికే అంటోన్న మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్‌కు అదే కలిసొచ్చిందంటూ..
Maniratnam
Follow us on

‘ఆలస్యం.. అమృతం.. విషం’ ఈ సామెత మనందరికీ తెలిసిందే. ఆలస్యమైతే అమృతం కూడా విషంలా మారుతుందని దీని అర్థం. కానీ తన విషయంలో మాత్రం ఆలస్యమే మంచి చేసిందని చెబుతున్నారు.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. ఈయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌ 1 సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లను రాబడతూ దూసుకుపోతోంది. సెప్టెంబర్‌ 30 విడుదలై మంచి బజ్‌ దక్కించుకుంది. విడుదలైన అన్ని చోట్లా భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో సెన్సేషన్‌ క్రియేట్ చేసిందీ సినిమా.

ఇదిలా ఉంటే నిజానికి ఈ చిత్రాన్ని గతంలోనే తెరక్కించాలని మణిరత్నం ప్లాన్‌ చేశారు. కానీ కొన్నేళ్లపాటు వాయిదా పడుతూ వచ్చి తాజాగా కార్యరూపం దాల్చింది. అయితే ఈ ఆలస్యం తనకు మంచే జరిగిందని మణిరత్నం చెప్పుకొచ్చారు. ఆలస్యం ఎందుకు మంచి అనేగా మీ సందేహం. అయితే మణిరత్నం చెప్పిన సమాధానం తెలుసుకోవాల్సిందే. ఈ విషయమైన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ సినిమాను తెరకెక్కించడానికి 1994, 2011లో రెండుసార్లు ప్రయత్నించాం. కానీ, కొన్ని కారణాల వల్ల ఆగిపోయాం. ఈ సినిమా తీయాలని నాతోపాటు చాలా మంది ప్రయత్నించారు’ అని చెప్పుకొచ్చారు.

పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ప్రేక్షకులకు ఎంతగానో చేరువైందన్న మణిరత్నం తనకు కూడా ఈ నవల ఎంతో ఇష్టమని తెలిపారు. ఈ సినిమా తీయడానికి ఎంతో కాలం వేచి చూశాననని, బహుశా అలా ఆలస్యం అవ్వడం కూడా మంచిదే అయిందన్నారు. కారణం.. అప్పటికీ ఇప్పటికీ సాంకేతికత చాలా అభివృద్ధి చెందడమే. దాని వల్లే ఈ సినిమాను సాంకేతిక పరంగా ఎలాంటి రాజీ లేకుండా చేయగలిగాం అని అసలు కారణం తెలిపారు మణిరత్నం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..