AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ఆ సినిమా చేసి తప్పు చేశా.. నాకు నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయనకు బాగా నచ్చిన సినిమా సింధూరం అని, అయితే సముద్రం, రాఖీ చిత్రాలలో తన పనితీరు పట్ల సంతృప్తి చెందలేదని స్పష్టం చేశారు. చిత్రాలు లేని జీవితాన్ని ఊహించలేనని, భార్య లేని జీవితాన్ని ఎంపిక చేసుకుంటానని అన్నారు.

Krishna Vamsi: ఆ సినిమా చేసి తప్పు చేశా.. నాకు నచ్చలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
Ntr, Krishna Vamsi
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 2:16 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత అభిప్రాయాలు, ఇతర దర్శకులు, నటీనటులపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సినిమాలలో తనకు అత్యంత నచ్చిన చిత్రంగా సింధూరంను కృష్ణవంశీ పేర్కొన్నారు. అయితే, సముద్రం, రాఖీ చిత్రాలలో తన పనితీరు పట్ల తాను సంతృప్తి చెందలేదని, ఒక దర్శకుడిగా ఆ చిత్రాలలో తన పని తనకు నచ్చలేదని స్పష్టంగా తెలిపారు. వ్యక్తిగత జీవితంపై అడిగిన ప్రశ్నకు, చిత్రాలు లేని జీవితం, భార్య లేని జీవితం , ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తే, భార్య లేని జీవితాన్ని ఎంచుకుంటానని, చిత్రాలు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

అభిమాన నిర్మాత గురించి మాట్లాడుతూ, నాగార్జునను తన ఫేవరెట్ ప్రొడ్యూసర్‌గా కృష్ణవంశీ చెప్పారు, ప్రత్యేకంగా నిన్నే పెళ్లాడతా చిత్రాన్ని ప్రస్తావించారు. తాను పనిచేసిన హీరోలలో, సినిమా అంటే ప్రాణం పెట్టే వారిలో ఎన్టీఆర్‌ను మొదటి స్థానంలో నిలబెట్టారు. తన జనరేషన్‌లో ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడిగినప్పుడు, రాజమౌళి, వినాయక్, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్ వంటి పేర్ల నుంచి శేఖర్ కమ్ములను ఎంపిక చేసుకున్నారు. శేఖర్ కమ్ముల చిత్రాలలో ఉండే మాధుర్యం, చిన్నపాటి రొమాన్స్, వాస్తవికత, సున్నితమైన అంశాలు తనకు నచ్చుతాయని, ఆయన చిత్రాలలో కఠినత్వం ఉండదని కృష్ణవంశీ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

వ్యక్తిగత అలవాట్ల గురించి ప్రస్తావిస్తూ, షూటింగ్ బిజీ లేనప్పుడు బయట తిరిగే విషయంపై “నా బాస్ ఇంట్లోనే ఉన్నారు” అని, తన భార్య నిర్ణయాల ప్రకారమే తాను బయటకు వెళ్తానని సరదాగా వెల్లడించారు. కృష్ణవంశీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న అత్యంత ప్రతిభావంతుడైన దర్శకులలో ఒకరు. సినిమాల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, సామాజిక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే ఆయన్ను పరిశ్రమలో “సృజనాత్మక దర్శకుడు” అని పిలుస్తారు.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us