
మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘మహర్షి’. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లు భారీ బడ్జెట్ తో నిర్మించాయి. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. కాగా ఈ సినిమా మే 9 రిలీజై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక చిత్ర యూనిట్ ఈరోజు విజయవాడలో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ‘మహర్షి’ విజయం మాకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. కాగా ముగ్గురు నిర్మాతలు కలిసి మరిన్ని సినిమాలు చేయాలనీ ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
పీవీపీ మాటల్లోనే…
సూపర్ స్టార్ మహేష్ రాబోయే 25 ఏళ్లు మహర్షి మహేష్ బాబు లాగా ఉండాలని భావిస్తున్నాను. సూపర్ స్టార్ అనేది బిరుదు అయితే మహర్షి అనేది బాధ్యత. తమ్ముడు వంశీ లాండ్ మార్క్ సినిమా తీశాడు. ముగ్గురు నిర్మాతలం ఇలాంటి బ్లాక్‌బస్టర్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను.
దిల్ రాజు మాటల్లోనే…
వైజయంతి మూవీస్, పివిపి సినిమాస్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ముగ్గురం కలిసి మహేష్ బాబుగారి 25వ సినిమాని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో ‘రాజకుమారుడు, ఒక్కడు, దూకుడు’ తర్వాత మహర్షి ఈవెంట్ జరుగుతోంది.
అశ్వినీదత్ మాటల్లోనే…
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ సినిమాని నిర్మించాను. ఆ సినిమా విజయవాడ అలంకార్ థియేటర్‌లో 100 రోజులు 4 షోలతో ఫుల్ అయ్యి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ రోజు గొప్ప నిర్మాతలతో కలిసి తీసిన ‘మహర్షి’ రికార్డులు సృష్టిస్తోంది.