Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగచైతన్య, సమంత, ఓ కుక్క పిల్ల.. ఇంతకీ ఈ జంట మధ్య ఏం జరుగుతోందబ్బా.?

సమంత, నాగచైతన్య విడాకులతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత కూడా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గతకొన్ని రోజుల నుంచి ఈ జంట మళ్లీ కలవబోతున్నారంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్య పోస్ట్ చేసిన ఓఫొటో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు హాష్‌ అనే పెంపుడు కుక్కను పెంచుకున్న విషయం తెలిసిందే...

నాగచైతన్య, సమంత, ఓ కుక్క పిల్ల.. ఇంతకీ ఈ జంట మధ్య ఏం జరుగుతోందబ్బా.?
Samantha Nagachaitanya
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 09, 2023 | 6:14 PM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు, ఏ అంశం, ఎందుకు చర్చనీయాంశంగా మారుతుందో తెలియడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాయి. ఒక చిన్న ఫొటో వెయ్యి వార్తలకు కారణంగా మారుతుంది. తాజాగా నాగ చైతన్య, సమంతలకు సంబంధించిన ఓ అంశం ఇలాంటి చర్చకే దారి తీసింది. ఇంతకీ అసలు కథెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సమంత, నాగచైతన్య విడాకులతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత కూడా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గతకొన్ని రోజుల నుంచి ఈ జంట మళ్లీ కలవబోతున్నారంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్య పోస్ట్ చేసిన ఓఫొటో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు హాష్‌ అనే పెంపుడు కుక్కను పెంచుకున్న విషయం తెలిసిందే. నిత్యం ఈ కుక్కతో కలిసి దిగిన ఫొటోలను ఈ జంట సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేది.

నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత నుంచి హాష్ సమంతతో ఉంది. గతంలో కొన్నిసార్లు సామ్‌ ఈ కుక్క ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కుక్కపిల్ల నాగచైతన్యతో కనిపించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగచైతన్య కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపిల్ల చైతన్య వద్దకు వచ్చింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా మరోసారి అదే కుక్క పిల్ల ఫొటోను చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కారులో తీసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చై, సామ్‌ ఫ్యాన్స్‌ ఈ జంట కలిసిపోయిందంటూ కామెంట్స్‌ చేసేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం చై కానీ సామ్‌ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.

Samantha

అయితే తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ మరో చర్చకు దారి తీసింది. సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవిత మార్గంగా అలవరుచుకునే వారికి హ్యాట్సాఫ్‌’ అనే కొటేషన్‌ రాసున్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో సమంత చేసిన పోస్ట్ వెనకాల అసలు కారణం ఏంటి.? చైతన్య, సమంత మళ్లీ కలిసిపోనున్నారని వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టడానికే ఇలాంటి పోస్ట్ చేసిందా.? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా అటు చై, ఇటు సామ్‌ చేస్తున్న ఈ పోస్టులు నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తాయని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..