Ajith Kumar: పుష్ప సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన అజిత్.. అసలు మ్యాటర్ వేరు అంటున్న నెటిజన్స్

తమిళ చిత్రసీమలోని ప్రముఖ నటులలో అజిత్ ఒకరు. అజిత్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ తాజాగా పివి. సింధు వివాహానికి హాజరయ్యారు. భార్య పిల్లలతో కలిసి అజిత్ సింధు సినిమాకు హాజరయ్యారు. తాజాగా అజిత్ పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలోని సాంగ్ కు అజిత్ స్టెప్పులేశారు.

Ajith Kumar: పుష్ప సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన అజిత్.. అసలు మ్యాటర్ వేరు అంటున్న నెటిజన్స్
Ajith
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 27, 2024 | 7:45 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక తమిళనాట ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అజిత్ ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న విదాముయార్చి చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. కాగా  ఇటీవల ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు వివాహానికి హాజరయ్యారు అజిత్.

భార్య షాలిని, పిల్లలతో కలిసి సింధు వివాహానికి హాజరయ్యారు అజిత్. ఈ వేడుకలో అజిత్ బ్లాక్ కోట్ సూట్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అజిత్ తన డాన్స్ తో అదరగొట్టారు. పుష్పా ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, సమంత సాంగ్ కు అజిత్ స్టెప్పులేశారు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోలో ఉంది అజిత్ కాదు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఆ కుర్రాడు అచ్చం అజిత్‌లా కనిపిస్తున్నాడు, అతను ఇటీవల ధరించిన నల్లటి కోటు, అతనిలాగే తెల్లటి జుట్టుతో ఉన్నాడు. దాంతో అతను అజిత్ అని అంటున్నారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నటుడు అజిత్‌లా కనిపిస్తుండడంతో కొందరు నటుడు అజిత్‌ అని అభిప్రాయపడుతున్నారు. అయితే వ్యక్తి  అజిత్ కాదు. నటుడు అజిత్ ప్రస్తుతం దర్శకుడు మిజ్ తిరుమేని చిత్రం విదాముయార్చి, అధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీలో సినిమాలో నటిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..