విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. హిందీ రీమేక్‌లో టైటిల్ రోల్ షాహిద్ కపూర్ పోషిస్తుండగా.. తమిళంలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న గిరిశయ్య తమిళ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరున విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం విదితమే.
ఇకపోతే ఈ చిత్ర టీజర్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో హీరో ధృవ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ చిత్రంపై అంచనాలను రేకెత్తించిందని చెప్పవచ్చు. అక్టోబర్ ఫేమ్ బానిటా సందు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.