Dhanush: పాఠాలు చెప్పేందుకు సిద్ధమైన్ ‘సార్’.. ధనుష్ కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే..
Dhanush: ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సార్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ధనుస్ నటిస్తోన్న తొలి తెలుగు చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి...
Dhanush: ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ధనుస్ నటిస్తోన్న తొలి తెలుగు చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.
దీంతో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే సోమవారం సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పోస్టర్‌లో ధనుష్ ఉపాధ్యాయుడి లుక్‌లో కనిపిస్తున్నాడు. తరగతి గదిలో బెంచ్‌పై కూర్చున్నట్లు చూపించారు. ఇక విద్యా వ్యవస్థ తీరుతెన్నుల మీద హీరో ఎలాంటి పోరు చేశాడు లాంటి ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..