1983 ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 83. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన భార్య రోమీ దేవ్‌గా రణ్‌వీర్ రియల్ వైఫ్ దీపికా కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇదివరకే రణ్‌వీర్ లుక్ వచ్చినప్పటికీ.. రణ్‌వీర్, దీపికా కలిసి ఉన్న లుక్ విడుదలైంది. అందులో ఈ ఇద్దరి జోడీ అదరగొట్టేస్తోంది. దీనిపై అభిమానులు దీప్‌వీర్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వివాహం తరువాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.
83లో తాహిర్ రాజ్ బాసిన్, అమ్మీ విర్క్, జీవా, చిరాగ్ పటేల్, అదిత్యా కోతరే, సాహిల్ కత్తర్, బొమన్ ఇరానీ, పంకజ్ త్రిపాఠీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 10న హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ మూవీని తెలుగులో నాగార్జున, తమిళ్‌లో కమల్ హాసన్ విడుదల చేస్తుండటం మరో విశేషం.
Read This Story Also:‘కుమారి’ మళ్లీ ఫాంలోకి వస్తుందా..!