Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • జమ్ము కాశ్మీర్లో బీజేపీ నేతపై ఉగ్రవాదుల కాల్పులు. బందీపూర్లో బీజేపీ నేత వసీం బారీపై కాల్పులు. కాల్పుల్లో బారీతో పాటు ఆయన సోదరుడు ఉమర్ సుల్తాన్, తండ్రి బషీర్‌కి కూడా గాయాలు.
  • అమారావతి: పది ప్రధాన ప్రాజెక్టులకు సంభందించి 198 పనులను ప్రీక్లోజర్ కు ప్రభుత్వం మొగ్గు. ప్రజెక్టుల పూర్తివ్యయ సమాచారం ఈ నెల 22లోగా ఇవ్వండంటూ ఆదేశం. కాంట్రాక్టు సంస్ధలకు చెల్లించిన మొత్తాలు, బ్యాంకు గ్యారెంటీలు, అడ్వాన్సులు, ముందస్తు బెంచి మార్కు విలువపై 22లోగా నివేదిక ఇవ్వాలంటూ జీవో ఉత్తర్వులు వెలువరించిన జలవనరుల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • అమరావతి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఏపీ వ్యాప్తంగా ఉన్న జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీలు. 151 మంది జూనియర్ సివిల్ జడ్జి లను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు.
  • అమరావతి: ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా చికిత్స ను చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స.

Hebha Patel: ‘కుమారి’ మళ్లీ ఫాంలోకి వస్తుందా..!

2015లో వచ్చిన కుమారి 21fతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది ముంబయి బ్యూటీ హెబా పటేల్. అంతకుముందు అలా ఎలా అనే చిత్రం
Hebha Patel news, Hebha Patel: ‘కుమారి’ మళ్లీ ఫాంలోకి వస్తుందా..!

2015లో వచ్చిన కుమారి 21fతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది ముంబయి బ్యూటీ హెబా పటేల్. అంతకుముందు అలా ఎలా అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కుమారి 21fతో అందరినీ తెగ ఆకట్టుకుంది హెబా. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ అమ్మడు అద్భుతంగా నటించగా.. యూత్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఇక ఈ సినిమా సక్సెస్‌తో హెబాకు అప్పట్లో వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోలేకపోవడం, ఫ్లాప్‌లు పడటంతో హీరోయిన్‌ రేస్‌‌లో ఈ భామ వెనుకపడిపోయింది. ఈ క్రమంలో 2018లో 24 కిస్సెస్ అనే చిత్రంలో మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత కనుమరుగైపోయింది. అంతేకాదు ఈ అమ్మడు బయట కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ.

అయితే ఇప్పుడు హెబాకు మళ్లీ ఆఫర్లు వస్తున్నాయి. హీరోయిన్‌గా కాకపోయినప్పటికీ.. రెండు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోంది కుమారి. రాజ్ తరుణ్‌తో విజయ్ కుమార్ నటిస్తోన్న ఒరేయ్ బుజ్జిగాలో రెండో హీరోయిన్‌గా కనిపిస్తోన్న హెబా.. నితిన్ నటించిన భీష్మలో ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్ర కీలకం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అహా ఫ్లాట్‌ఫాంలో వస్తోన్న మస్తీ అనే వెబ్ సిరీస్‌లో హెబా నటించింది. దీని ద్వారా వెబ్ సిరీస్‌ వరల్డ్‌లోకి అడుగెట్టింది హెబా. దీంతో హెబా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇలానే ఆమె సినిమాలు చేయాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో హెబా కెరీర్ దూసుకుపోతుందేమో..!

Related Tags